జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సీఎం సమీక్ష
అమరావతి
జగనన్న అమూల్ పాలవెల్లువపై క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం శ్ర వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్ఆడుతూ గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారు. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారు. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. హెరిటేజ్కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు.
అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చింది. అమూల్ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చింది. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుంది. మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నాం. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారు. వీరికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నాం. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలి. దీనివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుంది. మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని అన్నారు.