తెలుగు సాహిత్యానికే వన్నెతెచ్చిన కవి గుర్రం జాషువా
- ఏపీసీసీ అధ్యక్షులు డా.సాకే శైలజనాధ్
విజయవాడ
తెలుగు సాహిత్యంలోని భావకవిత్వానికే పద్మభూషణ్, కళాప్రపూర్ణ, గుర్రం జాషువా వన్నె తెచ్చారని ఏపీసీసీ అధ్యక్షులు డా సాకే శైలజనాధ్ అన్నారు. జాషువా 126 వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర రత్న భవన్ నుండి మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన సాహిత్యాన్ని కొనియాడారు. గుర్రం జాషువా కుల, మత, వాస్తవికతను, అంటరానితనాన్ని, పేదరికాన్నీ, దోపిడీలను, స్త్రీల పీడనాన్ని శక్తివంతమైన కవిత్వంగా మలిచారని అన్నారు. నిజంగా ఆయన రచనలు చూస్తే కళ్ళకి కట్టినట్లుగా సమస్యలు కనబడతాయని, గుర్రం జాషువా ప్రకృతి మీద, ప్రేమ మీద, పిల్లల మీద, కరుణ, విలువలు వంటివి తన రచనల లో చూపించారని అన్నారు. మనిషిని పశువు కన్నా హీనంగా చూసినా, చూస్తున్న చరిత్రను తన కవిత్వాల తో బలంగా చెప్పారని, అలానే ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడే జాషువా పలికించారన్నారు. ఇలా గుర్రం జాషువా తన తర్వాత రాబోయే దళిత కవులకు మార్గం చూపాడని, వేదన తో ఆగిపోకుండా స్త్రీల పీడనను ఎత్తు చూపిన కవి అని అన్నారు. గుర్రం జాషువా స్త్రీలకు ఎదిరింపు జాలని చిలుకల చదువు నేర్పే బానిసలుగా పడి ఉంటే స్థితిని తెచ్చిన పురుష స్వామ్యాన్ని గట్టిగా ఎండగట్టిన కవి జాషువా అని, తెలుగు జనం తెలుగు కవిత్వం గర్వించ దగ్గ కవి శిఖరం జాషువా అని కొనియాడారు. గుర్రం జాషువా కవిత్వం చూడడానికి చక్కగా ఉంటుందని, ఎన్నో సమస్యలను మనం కవిత్వం లో చూడొచ్చని. ఎన్నో అద్భుతమైన రచనలు గుర్రం జాషువా చేశారు. వాటిలో ముఖ్యమైన పుస్తకాలు పరిశీలిస్తే గబ్బిలం, స్వప్న కధ, ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, కొత్త లోకం, క్రీస్తు చరిత్ర, ఖండ కావ్యాలు, ఫిరదౌసి, నాగార్జున సాగర్ లు ప్రథమంగా నిలిచాయి ఇవే కాకుండా రుక్మిణీ కల్యాణం, భీష్ముడు, కోకిల, శివాజీ ప్రబంధం, ధ్రువ విజయం, సంసార సాగరం, సింధూరము, బుద్ధ మహిమ, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశాన వాటిక, మాతృ ప్రేమ, సాలీడు, హెచ్చరిక, వివేకానంద, గిజిగాడు, చంద్రోదయం, భారత వీరుడు, సూర్యోదయం, భారత మాత, యోగీంద్రుడు, వీర భాయ్, సీట్ల పేకాట, కొత్త లోకం, తెరచాటు, స్వయంవరం ఇలా ఎన్నో రచనలు చేశారని గుర్తుచేశారు. మహాకవి జాషువా రచనలకు గాను పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తు చరిత్రకు 1964లో క్రియేట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా జాషువా దక్కించుకున్నారని. అలానే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళా ప్రపూర్ణ కూడా జాషువా దక్కించుకున్నారని. అలానే కవితా విశారద, కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఇలా అనేక విధాలుగా అయన ప్రసిద్ధి చెందారని శైలజనాధ్ కొనియాడారు. ఇటువంటి మహానుభావుల ఆదర్శంగా తీసుకుని యువత ముందుకువెళ్లాలని శైలజనాధ్ తెలియజేసారు.