జమ్ముకశ్మీర్‌లోని ఉరి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి ప్రత్యేక ఆపరేషన్
లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హతం. ఒకడిని పట్టుకున్నభద్రతా బలగాలు
శ్రీనగర్ సెప్టెంబర్ సెప్టెంబర్ 28
జమ్ముకశ్మీర్‌లోని ఉరి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు మరో ఉగ్రవాదిని హతమార్చారు. లష్కరే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు పట్టుకున్నాయి. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందినవాడు. తన పేరు అలీ బాబర్ పాత్రా అని అతడు చెప్పినట్లు మేజర్ జనరల్ వీరేంద్ర వెల్లడించారు. తాను లష్కరే తోయిబా ఉగ్రవాదినని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో తనకు శిక్షణ ఇచ్చినట్లు అతను విచారణలో చెప్పాడు. గత ఏడు రోజులలో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.పాకిస్థాన్ ఆర్మీ సాయం లేకుండా సరిహద్దులో ఇంత మంది కదలికలు అసాధ్యమని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాల్లో కదలికలు ఉన్నాయని మేజర్ వీరేంద్ర చెప్పారు. గత ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ సాగించిన అతి పెద్ద ఆపరేషన్ ఇదే. ఈ నెల 18 నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. గత మూడు రోజులలో నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు.