YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస దొంగ ఓట్లతో జాగ్రత్త

తెరాస దొంగ ఓట్లతో జాగ్రత్త

తెరాస దొంగ ఓట్లతో జాగ్రత్త
హుజూరాబాద్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మదువని గార్డెన్ లొ మాజీ మంత్రి ఈటెల రాజేందర్  మాట్లాడుతూ వందల మంది వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర నాయకులు   హుజురాబాద్ లొ ప్రజా స్వామిక విధానాన్ని నాశనం చేశారు. పచ్చటి సంసారం లో చిచ్చు  పెట్టారు.  హుజురాబాద్ ప్రజానీకాన్ని భయ బ్రాంతులకు గురి చేశారు. 5నెలల కాలం పాటు తినకుండా భయపడకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఈటెల రాజేందర్ ను  కాపాడుకుంటాం అని అండగా ఉన్నందుకు శిరస్సు వంచి ప్రజలకు  నమస్కరిస్తూన్న అన్నారు  మంత్రులు గా ఉన్న వారు వారి విధానం చెప్పాలి. స్వయంగా హరీష్ రావు పోలీసు కు  అదేశమిస్తాడు. సీనియర్ నాయకులను చులకనగా చూస్తాడు. ధమ్మక్కపేట్ లో సీనియర్ నాయకుడు సమ్మిరెడ్డి నాతో రమ్మంటే ఆయన  ఇంటికి 12 గంటల రాత్రి పోయి  ఇబ్బందులకు  గురి చేసాడు.హుజురాబాద్ లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈటెల వెంటే ఉంటా అని చెప్పారు. హరీశ్ రావు నిజస్వరూపం హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా బయటపడ్డది. సిద్ధిపేట, గజ్వేల్ నుండి హుజురాబాద్ ఎన్నికలు జరుపుకోవాలని చూస్తే హుజురాబాద్ ప్రజలు సహించారు. దళిత బంధు, పెన్షన్ రావాలంటే టిఆర్ఎస్ కండువా కప్పుకోవాలి. గత 20 ఏండ్లుగా ప్రజలతో మమేకమై ఉన్నాను. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కండువా కప్పుకుంటే ఉంటారని అన్నారు. స్వయంగా మంత్రులు, ఎమ్యెల్యే లు దవాత్ లు ఇస్తున్నారు. పరమ నీచనికి ఒడిగొట్టారు.ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించండి. ప్రజలు జై ఈటెల జై బీజేపీ మాట మాట్లాడుతున్నారు. మోక్కవోని ధైర్యంతో నాతో ఉన్నారు. నన్ను గత 18 సంవత్సరాలుగా నన్ను వారి గుండెల్లో ఉంచుకున్నారు  ధన్యవాదాలు. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బులను తీసుకొని ఈటెల కు ఓటేయండి. కేసీఆర్ అహంకారానికి, ప్రజాస్వామ్య విలువలకు ఈ ఎన్నిక జరుగుతుంది. ఓట్లకు విలువ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. హుజురాబాద్ చాలా చైతన్యవంతమైన గడ్డ. దొంగ ఓట్లు నమోదు చేసేందుకు అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మద్యం, డబ్బులు, కుట్రలతో ఎన్నిక నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటుని అయన విమర్శించారు.  ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జి జితేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కృష్ణ రెడ్డి,  బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేారెడ్డి, ఎండల లక్ష్మీ నారాయణ, ధర్మ రావు, తుల ఉమ, అశ్వద్ధామ రెడ్డి.  పాల్గొన్నారు

Related Posts