భబానిపుర్ ఉప ఎన్నికలను రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన కోల్‌కతా హైకోర్టు
కోల్‌కతా సేప్తీమ్బెర్ 28
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భబానిపుర్ నియోజకవర్గం ఉప ఎన్నికలను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికలను రద్దు చేయబోమని కోర్టు స్పష్టం చేసింది. గురువారమే ఆ ఎన్నికను నిర్వహించనున్నట్లు కోర్టు చెప్పింది. భబానిపుర్ నుంచి 2011, 2016లో దీదీ ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంకా తిబ్రేవాల్‌తో మమతా పోటీపడుతున్నారు. 41 ఏళ్ల తిబ్రేవాల్ కోల్‌కతా హైకోర్టులో లాయర్‌గా చేస్తున్నారు. మూడవసారి సీఎం అయిన మమతా బెనర్జీ.. నందీగ్రామ్‌లో ఓడిపోవడం వల్ల.. భబానీపుర్ ఉప ఎన్నికలో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెలుబడుతాయి.