YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉమా ఎందుకు సైలెంట్ అయిపోయారు

ఉమా ఎందుకు సైలెంట్ అయిపోయారు

ఉమా ఎందుకు సైలెంట్ అయిపోయారు
విజయవాడ, సెప్టెంబర్ 29,
రాజకీయాల్లో శత్రువుల సహజం. అలాగే నమ్మకైన వారు కూడా వెన్నంటి ఉండాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమకు మిత్రులకన్నా శత్రువులే ఎక్కువగా ఉన్నట్లుంది. రెండు దశాబ్దాలుగా దేవినేని ఉమ రాజీకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన సంపాదించుకున్నది మాత్రం ఖచ్చితంగా శత్రువులననే చెప్పాలి. ఆయన గత రెండున్నరేళ్లుగా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదీ కలసి రావడం లేదు. తాను అనుకున్నవాళ్లే మోసం చేసి వెళ్లిపోయారు.దేవినేని ఉమ తెలుగుదేశంలో కీలక నేతగా ఎదిగారు. తన సోదరుడు దేవినేని వెంకటరమణ హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉమ ఎన్నడూ వెనుదిరగి చూసుకోలేదు. నాటి నుంచి నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి గెలుస్తూ వస్తున్నారు. తొలిసారిగా 2019 ఎన్నికల్లో దేవినేని ఉమకు ఓటమి ఎదురయింది. అప్పటి నుంచి దేవినేని ఉమకు కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. జగన్ టార్గెట్ దేవినేని ఉమగానే కన్పిస్తున్నారు.2014లో గెలిచిన దేవినేని ఉమకు చంద్రబాబు ముఖ్యమైన ఇరిగేషన్ మంత్రి పదవి ఇచ్చారు. నాటి నుంచే దేవినేని ఉమ ఆప్తులను, సన్నిహితులను దూరం చేసుకున్నారు. అధికారంలో ఉండగా ఎవరినీ పట్టించుకోక పోవడం, ఎన్నికలు రాగానే కౌగిలింతలు రుచించని కొందరు నేతలు దేవినేని ఉమను గత ఎన్నికల్లో దెబ్బకొట్టారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సయితం దేవినేని ఉమకు ఘోర పరాజయం ఎదురయింది.మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యత దక్కించుకుంది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన టీడీపీ నేతలు సయితం వైసీపీ లో చేరిపోయారు. ఇది దేవినేని ఉమను మానసికంగా దెబ్బతీసినట్లయింది. దేవినేని ఉమను మైలవరం లో పూర్తిగా దెబ్బతీయడానికి వైసీపీ వేసిన వ్యూహంలో టీడీపీ నేతలు చిక్కుకు పోతున్నారు. దేవినేని ఉమ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.

Related Posts