YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రి పంచాయితీకి జగన్ మార్క్ ఫుల్ స్టాప్

రాజమండ్రి పంచాయితీకి జగన్ మార్క్ ఫుల్ స్టాప్

రాజమండ్రి పంచాయితీకి జగన్ మార్క్ ఫుల్ స్టాప్
విజయవాడ, సెప్టెంబర్ 29,
తాడేపల్లిలో రాజమండ్రి పంచాయతీ ముగిసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ రామ్ ల మధ్య సయోధ్య కుదిరింది. ఇద్దరికీ పరోక్షంగా హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. భవిష్యత్ లో పార్టీ లైన్ దాటితే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాజమండ్రి పంచాయతీకి తాత్కాలికంగా తెరపడినట్లేనని చెబుతున్నారు. గంటల కొద్దీ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇద్దరిని కూర్చోబెట్టి విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. కొంత కాలంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇద్దరూ బహిరంగంగా పరస్పర దూషణలకు దిగారు. పార్టీ ఆదేశాలను థిక్కరించి కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అధినాయకత్వాన్ని కూడా కలవరపర్చింది. ఇద్దరూ బలమైన సామాజికవర్గం నేతలు కావడంతో సమస్యను స్మూత్ గా డీల్ చేయాలని హైకమాండ్ భావించింది. అందుకే ఇద్దరినీ తాడేపల్లికి పిలిపించి మరీ క్లాస్ పీకింది.త్వరలో రాజమండ్రి కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం వైసీపీకి అవసరం. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలం క్రమంగా పెరుగుతుంది. టీడీపీలో నెలకొన్న విభేదాలు వైసీపీని ఆనందపర్చే లోగా నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డిల మధ్య నెలకొన్న విభేదాలు తమకు అనుకూలంగా మారతాయని భావించిన తరుణంలో మార్గాని, జక్కంపూడిల మధ్య వార్ ఇరుకున పెట్టింది.అందుకే ఇద్దరికీ జగన్ హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారని చెబుతున్నారు. ఇద్దరూ కలసి కట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ లో ఎలాంటి వ్యాఖ్యలు తాను వినకూడదని జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇద్దరు చెప్పిన వివరణలను సానుకూలంగా విన్న జగన్ ఇద్దరికి చేతులు కలిపి పంపించేశారని పార్టీ వర్గాలు చెప్పాయి.

Related Posts