రఘురామ కృష్ణరాజు గారి సర్వేపై చర్చోప చర్చలు
ఏలూరు, సెప్టంబర్ 29,
సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ ను బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. ఇప్పటి వరకూ జగన్ ను, ప్రభుత్వంపైనా విమర్శలు చేసే ఆయన కొత్త ఎత్తుగడను ఎంచుకున్నట్లు కనపడుతుంది. జగన్ గ్రాఫ్ పడిపోయిందంటూ ఇటీవల కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారు. తాను సర్వేలు చేయిస్తున్నానని ఇందులో జగన్ గ్రాఫ్ 15 శాతం పడిపోయిందని రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు.గతంలో కూడా రఘురామ కృష్ణరాజు సర్వే చేయించినట్లు చెప్పారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సర్వే చేయిస్తే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప వచ్చే ఎన్నికల్లో ఎవరూ గెలవరని తన సర్వేలో తేలినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు కొత్తగా జగన్ గ్రాఫ్ పైన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించినట్లు చెబుతున్నారు. ఎవరు సర్వే చేశారో? దానికి ప్రాతిపదిక ఏంటో మాత్రం రఘురామ కృష్ణరాజు చెప్పడం లేదు.దీన్ని బట్టి సర్వే పేరుతో జగన్ పార్టీకి నష్టం చేయాలని మాత్రం రఘురామ కృష్ణరాజు చూస్తున్నట్లుంది. ఒక సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే అందుకు సంస్థలు నెలల కొద్దీ సమయం తీసుకుంటాయి. ఇందుకోసం శాంపిల్స్ ను బట్టి సమయాన్ని కేటాయిస్తాయి. కానీ ఎంతమంది అభిప్రాయాలు తీసుకుంది? ఎందరు జగన్ కు అనుకూలంగా, ప్రతికూలంగా మాట్లాడింది మాత్రం రఘురామ కృష్ణరాజు చెప్పలేదు. కేవలం తాను సర్వే చేయించనట్లు చెబుతూ అందులో జగన్ గ్రాఫ్ తగ్గిందని చెబుతున్నారు.కానీ రఘురామ కృష్ణరాజు కేవలం జగన్ పార్టీపై బురద జల్లడానికే ఫేక్ సర్వేల కార్యక్రమాన్ని ప్రారంభించారన్న కామెంట్స్ వైసీపీ నేతల నుంచి వినపడుతున్నాయి. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు పడేందుకు సమయం దగ్గరపడిందని అందుకే ఆయనకు మతిభ్రమించి సర్వేల ఎత్తుగడను ఎంచుకున్నారని వైసీపీ పార్లమెంటు సభ్యులు అంటున్నారు. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు జగన్ ను దెబ్బతీయడానికి కొత్తగా సర్వే లను ఎంచుకున్నట్లు కనపడుతుంది.