YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతులకు అన్యాయం జరుగుతోంది : వీహెచ్

రైతులకు అన్యాయం జరుగుతోంది : వీహెచ్

అనేక హామీలు ఇచ్చి సీఏం కాగానే నేరవేర్చుతా అన్నడు. రైతు రుణమాఫీ చేయలే ,ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలే ,మూడు వేల పైచిలుకు రైతులు చనిపోతే ఏ ఓక్కఓక్క రైతు కుటుంబం ను ఆదుకోలేదని కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం నాడు అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఏన్నికలు దగ్గరకు వస్తాయనని రైతుబందు అనే కొత్త నాటకం మొదలుపెట్టిండని విమర్శించారు. గిట్టుబాటు ధర రాకపోతే నిలదీయండి ,ధర్నాచేయమని చెప్పిండు. దర్నా చేస్తే రైతులకు సంకెళ్ళు వేసిండు ఈయన రైతు బంధువాని నిలదీసారు. రైతుబందు కార్యక్రమానికి ఇతర రాష్ర్టాల నేతలను పిలుస్తున్నడు. వచ్చే నేతలకు నేను విజ్ణప్తి చేస్తున్న మీరు రావద్దని విజ్ణప్తి చేస్తున్నా. వస్తె అన్యాయాన్నిమీరు  సమర్దించినట్లేనని అయన అన్నారు. సివిల్స్ టాపర్ వచ్చినోని  కుటుంబానికి ఇంట్లో బోజనం పెట్టినవ్.కానీ,  స్టడీ సర్కిల్ ల చూడ వసతులు లేక ఏంత ఇబ్బంది పడుతున్నారో అని అయన అన్నారు. సమస్యలను డైవర్ట్ చేయడానికే ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చారు. అఖిలేష్ ,స్టాలిన్, మమతాబెనర్జీ కీ రైతు బందు కార్యక్రమం కు రావద్దని కోరుతూ వాళ్ళకు లేఖ రాస్తా ...రైతులకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వాళ్లకు  వివరిస్తానని అన్నారు. రైతు బంధు అంటె రైతుకు సంకెళ్ళు వేయడమా. రైతులకు జరిగిన అన్యాయం ను వివరించే  పోస్టర్ ను అయన  రిలీజ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టర్ల ను అంటింస్తాం. రైతులకు జరిగిన అన్యాయం ను ప్రజల్లోకి తీసుకెల్తామని అయన అన్నారు. 

Related Posts