చిన్న వ్యాపారులు... జరాభద్రం
ముంబై, సెప్టెంబర్ 29,
స్టాక్ మార్కెట్లు గత ఏడాదిన్నర నుంచి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సెన్సెక్స్ 60 వేల పాయింట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. మార్కెట్ ఇలా వేగంగా పెరుగుతూ ఉండడం ఆర్‌బీఐని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. దేశ ఎకానమీతో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయని ఆర్‌బీఐ ఇప్పటికే హెచ్చరించింది. ఒకవేళ కరెక్షన్ వస్తే చిన్న ఇన్వెస్టర్లే ఎక్కువగా నష్టపోతారని అభిప్రాయపడుతోంది. ఈ సారి మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం విదేశీ ఇన్వెస్టర్లు కాదని, రిటైల్ ఇన్వెస్టర్లని కూడా ఈ సంస్థ పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లు ఐపీఓల కోసం ఇన్వెస్టర్లకు ఇచ్చే లోన్లను ఆర్‌బీఐ వ్యక్తికి రూ. కోటికి పరిమితం చేసింది. ఇదే బ్యాంకుల వద్ద అయితే వ్యక్తికి రూ. 10 లక్షలుగానే ఉంది. ఈ నిర్ణయంతో మార్కెట్‌లో హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ) ఇన్వెస్ట్ చేయడం తగ్గుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. గత ఏడాది కాలం నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోస్ ఎక్కువయ్యాయి. డీమాట్ అకౌంట్లు, మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరిగింది. దీంతో కొంత మంది ఎక్స్‌పర్ట్‌లు మార్కెట్‌లు ప్రస్తుత హై వాల్యుయేషన్స్ వద్ద నిలబడగలవా అని సందేహిస్తున్నారు. దేశంలో ప్రజల ఆదాయాల్లో అంతరాయం పెరుగుతోందని, మొత్తం ఎకానమీ ఇంకా వేగం పుంజుకోలేదని కిందటి వారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓ స్పీచ్‌లో పేర్కొన్నారు. దీంతో చాలా చిన్న వ్యాపారాలు మూతపడ్డాయని, జాబ్ లాస్ పెరిగిందని చెప్పారు. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని ఆర్‌బీఐ ఆందోళన చెందుతోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ కరెక్ట్ అయితే చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతారని భావిస్తోందని చెప్పారు. ‘స్టాక్ మార్కెట్‌లో ఏం జరుగుతోందో ఆర్‌బీఐ కచ్చితంగా పట్టించుకుంటుంది. ఎకానమీలో ఇది కూడా ఒక పిల్లర్ లాంటిది’ అని ఫిలిప్స్ క్యాపిటల్ బ్రోకరేజి కన్సల్టెంట్ జోదీప్ సెన్ అన్నారు. ముఖ్యంగా మార్కెట్ ర్యాలీలో పాల్గొన్న చిన్న ఇన్వెస్టర్లకు మార్కెట్ సైకిల్స్‌పై, వొలటాలిటీపై అవగాహన ఉందా? లేదా? అనే యాంగిల్ నుంచి చూడాల్సి ఉందని అన్నారు. ఈ ఏడాది పబ్లిష్ చేసిన ఆర్‌బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లోనూ ఫైనాన్షియల్ మార్కెట్లు పెరుగుతుండడంపై శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థలో, గ్లోబల్ ఎకానమీలో లిక్విడిటీ ఎక్కువగా ఉంది. అందుకే స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి. రియల్ ఎకానిమీతో సంబంధం లేకుండానే పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో కచ్చితంగా మార్కెట్లు పడతాయి. కానీ, ఈ కరెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పడం చాలా కష్టం’ అని సెన్సెక్స్ 38 వేల దగ్గర ఉన్నప్పుడు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తాజాగా సెన్సెక్స్ 60 వేలు టచ్ చేసింది. కానీ, మార్కెట్‌లో ఇంకా కరెక్షన్ ప్రారంభం కాలేదు! స్టాక్ మార్కెట్ ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తోందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజివ్ భాసిన్ అన్నారు. ‘ర్యాలీ మిస్ అవుతామనే భయాలతో రిటైల్ ఇన్వెస్టర్లు, కొంతమంది ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేవారికి రిస్క్–రివార్డ్ రేషియో ఫేవరబుల్‌గా లేదు’ అని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ పబ్లిక్‌గా స్టాక్ మార్కెట్లపై జాగ్రత్తగా ఉండాలని ప్రకటించలేదు. కానీ, వ్యవస్థలో అసమానతలు ఉన్నాయని కిందటి వారం శక్తికాంత దాస్ చెప్పారు. ‘ కరోనా వలన సర్వీస్, ఇన్‌ఫార్మల్ సెక్టార్లలోని వర్కర్లు, రోజువారీ జీతాలపై ఆధారపడేవాళ్లు ఎక్కువగా నష్టపోయారు. వారి ఉద్యోగాలు, ఆదాయాలు పడిపోయాయి’ అని పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్లపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, బ్రాడ్ ఎకానమీ వృద్ధి చెందడానికి అడ్డంకిగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోందనే ఆందోళనను ఫైనాన్షియల్ సస్టయినబుల్ రిపోర్ట్‌లో ఆర్‌బీఐ వ్యక్త పరిచింది. ‘ఫైనాన్షియల్ మార్కెట్స్ మధ్య మధ్యలో పడుతూ పెరిగాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు ఓవర్ వాల్యుయేషన్ స్టేజ్‌కు చేరుకున్నాయి. మార్కెట్‌లో రేట్లు పెరుగుతుండడంతో బాండ్ ఈల్డ్‌లు కూడా పెరుగుతాయి. ఎమెర్జింగ్ మార్కెట్లకు వచ్చే క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ కొంత నెమ్మదిస్తాయి’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది. సెన్సెక్స్ బుశరం కొద్దిగా పెరిగి 60 వేల పైన క్లోజయ్యింది. ఇంట్రాడేలో 60,412.32 పాయింట్ల దగ్గర ఆల్‌టైమ్ హైని టచ్ చేసిన ఈ ఇండెక్స్, చివరికి 29 పాయింట్ల లాభంతో 60,078 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ రెండు పాయింట్లు లాభపడి 17,855 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆటో షేర్లు పెరిగినప్పటికీ, ఐటీ, ఫార్మా షేర్లు పడడంతో సెన్సెక్స్ ఓపెనింగ్ లాభాలను కోల్పోయింది. సెన్సెక్స్‌లో మారుతి సుజుకీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నా దేశీయ మార్కెట్లు ఒకే రేంజ్‌లో ట్రేడయ్యాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ వినోద్ మోడీ పేర్కొన్నారు. ఆటో షేర్లు పెరిగినప్పటికీ ఐటీ, ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ఇండెక్స్‌లు పెద్దగా పెరగలేదన్నారు. హాంకాంగ్, సియోల్ మార్కెట్లు లాభాల్లో క్లోజవ్వగా, షాంఘై, టోక్యో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు తగ్గి 73.83 వద్ద సెటిలయ్యింది.