YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలే దాడి చేస్తారు నోరు జారిన ఉపముఖ్యమంత్రి

జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలే దాడి చేస్తారు నోరు జారిన ఉపముఖ్యమంత్రి

జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలే దాడి చేస్తారు
నోరు జారిన ఉపముఖ్యమంత్రి
తిరుమల
ప్రజలే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే రోజు వస్తుందంటూ నోరు జారారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. బుధవారం  ఉదయం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి,దర్శనానంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై చిందులు వేశారు, వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్  పై మాట్లాడితే తన వ్యక్తిత్వానికే  లోటని తెలిపారు. మహిళలను కించపరిస్తే నేను ప్రత్యక్షమౌతాననే  పవన్ కళ్యాణ్ నీ వల్ల ఎంత మంది మహిళలు దెబ్బతిన్నారు అంటూ ఓ మహిళ స్టేట్మెంట్ ఇవ్వడం నిజం కాదా అని  ప్రశ్నించారు నారాయణ స్వామి. పరిపాలనా దక్షత లేని వ్యక్తి, ఆవేశపూరితమైన వ్యక్తి ,తరచూ పార్టీలు మారే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అందుకే ఆయన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. కులాల పై రాజకీయాలు చేసే వ్యక్తి ఎప్పటికి  నాయకుడు కాలేడని, అందుకే ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ప్రజలు ఆయన తిరస్కరించారంటూ గుర్తు చేశారు. సినీనటుడు కాబట్టే యువత ఆయన్ను ఆదరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారే తప్పా ,ప్రజల్ని సోమరిపోతులు చేయడం లేదని సోమరిపోతులు అంటే బ్యాంకులను కొల్లగొట్టిన విజయ్ మాల్యా లాంటి  వారని బ్యాంక్ ఎగవేతదారులను ఏత్తిచూపారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం ముప్పేట దాడి అనే ప్రశ్నకు నారాయణస్వామి బదులిస్తూ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం దాడిచేసే రోజుకన్నా ప్రజలే ముఖ్యమంత్రిపై దాడి చేసే రోజు వస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు జారారు అంతటితో ఆగక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై  ప్రజలు రోడ్డెక్కి రోజు కూడా త్వరలోనే ఉందంటూ నోరు జారారు. ..

Related Posts