YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హూజురాబాద్ కు అంతా సిద్ధం

హూజురాబాద్ కు అంతా సిద్ధం

హూజురాబాద్ కు అంతా సిద్ధం
కరీంనగర్, సెప్టెంబర్ 29, 
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తేదీ వచ్చింది. ఇక సమరానికి సై అంటున్నాయి రెండు పార్టీలు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీలు గత మూడు నెలల నుంచి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలందరూ ఇక్కడ పర్యటించారు. ఇప్పుడు షెడ్యూలు విడుదల కావడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.మంత్రి పదవి నుంచి తొలగించి, అవినీతి ముద్ర వేసి ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో ఈటల రాజేందర్ జూన్ 12వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ హుజూరాబాద్ లో ఫోకస్ పెట్టింది. మండాలాలనికి ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా నియమించింది. హరీశ్ రావు అయితే హుజూరాబాద్ లోనే దాదాపు మకాం వేశారు. దళిత బంధు పథకాన్ని ఈ ఎన్నిక కోసమే ప్రకటించారు.ఇక ఇక్కడ పోటీలో ఉంది ఈటల రాజేందర్. బీజేపీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏమాత్రం బలం లేదు. కేవలం ఈటల రాజేందర్ వ్యక్తిగత ఓటు బ్యాంకు మాత్రమే ఈ ఎన్నికలలో బీజేపీ వైపు ఉంటుంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర కూడా నిర్వహించారు. నిత్యం ప్రజల్లోకి వెళుతూ ఆత్మగౌరవాన్ని గెలిపించాలని, డబ్బులకు ఆశపడవద్దని ఈటల రాజేందర్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ అభ్యర్థిని ఎంపిక చేయలేదు. హుజూరాబాద్ లో ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించలేదు. కొండా సురేఖ అని అనుకున్నా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. అభ్యర్థి ఎవరనేది తేల్చాల్సి ఉంది. వచ్చే నెల 1వ తేదీన పార్టీ ఇన్ ఛార్జి హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీినియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పై స్పష్టత వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా ఇక్కడ పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే.

Related Posts