జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా!
టోక్యో సెప్టెంబర్ 29
జపాన్ అధికార పార్టీ నేతగా ఫుమియో కిషిడా ఎన్నికయ్యారు.ఆయన కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి .కిషిడా వయసు 64 ఏళ్లు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో కిషిడాను సోమవారం నియమించే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌తో జపాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో తాను దేశాన్ని నడిపించలేకపోతున్నట్లు ఇటీవల ప్రధాని సుగా తెలిపారు. దాంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకున్నది. హిరోషిమాకు చెందిన కిషిడా.. ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ట్రిలియన్ల డాలర్ల యెన్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లు పోలయ్యాయి. కోనోకు 170 ఓట్లు వచ్చాయి. జపాన్ మార్కెట్‌లో కొంత ఒడిదిడుకులు మొదలయ్యాయి. నిక్కీ ఇండెక్స్ రెండు శాతం పడిపోయింది.