పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
విజయవాడ సెప్టెంబర్ 29
పాలిటెక్నిక్ ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా పాలిసెట్ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా టెక్నికల్ ఎడ్యకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాం. విద్యార్థులకి స్కిల్‌డెవలప్‌మెంట్ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.