YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత

అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత

అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత
సంగారెడ్డి
అమీన్ పూర్ మునిసిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతుంది, ప్రతిపక్ష పార్టీ బంధువుకు చెందిన ఓ నిర్మాణాన్ని కూల్చివేయటం ఉద్రిక్తతకు దారి తీసింది.  సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు, రెవిన్యూ, మునిసిపల్, ఇరిగేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు, త్రిపుర కాలనీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత బంధువు ఇంటిని కూల్చివేయటం ఉద్రికత్థకు దారితీసింది, అధికార పార్టీ కుట్ర పూరితంగ వ్యవహరిస్తూ అధికారులను అస్త్రంగ ఉపయోగిస్తూ కూల్చివేతలకు పాల్పడడం దారుణం అని బాధితుడు అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారు జామునే కూల్చివేతలకు పాల్పడటం ప్రతీకార చర్యఅని అన్నారు. ఈ కూల్చివేతలపై న్యాయ పోరాటానికి దిగుతామని, మునిసిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించాడు.

Related Posts