YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వివక్ష తొలగాలి : స్పీకర్ మధుసూదనా చారి

 వివక్ష తొలగాలి : స్పీకర్ మధుసూదనా చారి

దేశ అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తో ముడిపడి ఉంది.  71 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా సమాజంలో అనేక రకాల వివక్షత,  సమస్యలు నెలకొని ఉన్నాయి. ఏక కాలంలో అనేక వైరుద్యాలున్నాయి. మన దేశం లో కుబేరులు..సంపన్నులతో పాటు నిరుపేదలు..అభాగ్యులు ఉన్నారని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి అన్నారు.   నేటికీ ఇటువంటి తారతమ్యాలు కొనసాగడం సరికాదు. అంతరాలు తొలిగి పోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతోపాటు ప్రతి ఒక్కరం ఈ వివక్షను తొలగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దేశ స్వరూప స్వభావాలు మార్చడం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు గుణాత్మక పాత్ర పోషించాలని అయన అన్నారు.  నా నియోజకవర్గం లో ఈ సమస్య లపై పల్లె నిద్ర, పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.  మారు మూల ప్రాంతానికి చెందిన బాహ్య ప్రపంచానికి తెలియని పది కుటుంబాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి.  ఇప్పటికీ అధికారులెవరో ప్రభుత్వం అంటే ఏమిటో కూడా తెలియని ఇటువంటి కుటుంబాలు ఎట్లా అభివృద్ధిని సాధిస్తాయయని అయన అన్నారు.  స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 15శాతం అక్షరాస్యత ఉండేది. ఏడాదికి ఒక్క శాతం పెరిగినా ఈ 70 ఏళ్లలో 90శాతం దాటి ఉండేది.  71 ఏళ్ల స్వతంత్ర దేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించలేదు.  మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని సీఎం కేసీఆర్ నిరూపించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు విషయంలో సీఎం కేసీఆర్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారని అన్నారు.  ఒక నాయకునికి విజన్ వుంటే అద్భుతాలు సృష్టించడం సాధ్యమే అని కేసీఆర్ చాటి చెప్పారు.  మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ  రాబోయే తరాల వారి సంక్షేమము కోసమేనని అన్నారు. 

Related Posts