YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గ్యాస్ సబ్సిడీపై కొత్త పథకం

గ్యాస్ సబ్సిడీపై కొత్త పథకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30,
గ్యాస్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇదే సమయంలో.. వంట గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై అంతర్గతంగా చర్చ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్ల ధరలపై ప్రభుత్వం ఓ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వేలో.. పెరిగిన గ్యాస్‌ ధరలను చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్టుగా తేలిందట.. దీంతో.. గ్యాస్‌ సిలిండర్‌పై మరింత వడ్డింపు తప్పదనే చర్చ మొదలైంది. దీని కోసమే కొత్త పథకం ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం రెండు ప్రతిపాదనలపై దృష్టిసారించింది కేంద్రం.. అందులో ఒకటి.. ఎలాంటి సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లను ఏ వినియోగదారుడికైనా అమ్మడం అయితే.. రెండోది ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను అందించడం.. ఇప్పుడు అంతర్గత ఈ విషయంపైనే చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతునన సమాచారం ప్రచారం.. కొత్త పథకం ద్వారా కుటుంబ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు, ఆపైగా ఉన్న కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వదు సర్కార్.. అవసరమైన ప్రజలకే గ్యాస్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని భావనలో సర్కార్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది.. అయితే, కరోనా నేపథ్యంలో అంతర్జాతీయగా ముడి చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీని చాలా వరకు నిలిపివేశారు.. రెండు ప్రతిపాదనలు ఉన్నా.. క్రమంగా వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడమే ఎన్డీఏ సర్కార్‌ ప్లాన్‌గా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Related Posts