YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా ఎక్స గ్రేషియాపై మరో వివాదం

కరోనా ఎక్స గ్రేషియాపై మరో వివాదం

ముంబై, సెప్టెంబర్ 30,

కరోనా ఎక్స గ్రేషియాపై మరో వివాదం సొమ్ము ఒకరిది.. షోకు మరొకరిదా
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది. అయినా ఆ మహమ్మరి తాలుకా భయాలు మాత్రం ప్రజలను పూర్తిగా వదలడం లేదు.భారత్ లోనూ కరోనా ఎఫెక్ట్ భాగానే పడింది. కరోనా ఫస్ట్ వేవ్ మోదీ సర్కారు సమర్ధవంతంగా ఎదుర్కొంది. అయితే సెకండ్ వేవ్ ను ముందస్తుగా గుర్తించకపోవడంతో భారత్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో వైద్యులు, సిబ్బందిపై అధిక భారం పడింది. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో ఆయా రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోయింది.. ఇదే సమయంలో ప్రజలు కరోనాపై అవగాహన పెంచుకొని జాగ్రత్తలు పాటించడంతో ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. ఒక్క కేరళలో మాత్రం కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందనే విమర్శలను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ఈ సమయంలో కేంద్రం సాయం అందించడంలోనూ మీనమేషాలు లెక్కించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అనేక విమర్శల తర్వాత కేంద్రం కరోనా ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఈ సాయం వల్ల నేరుగా ఏ ఒక్కరికి లబ్ధి చేకూరడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం ప్రకటించిన సాయంపై రాష్ట్రాలు సైతం పెదవి విరిచాయి. అయినా సరే కేంద్రం.. రాష్ట్రాలు అడిగిన విధంగా సాయం చేయలేమని తేల్చిచెప్పేసింది. కాకపోతే ఆయా రాష్ట్రాలు అప్పులు చేసి తీర్చుకునే వెసులుబాటును మాత్రం కల్పించింది. వీటికి కూడా కేంద్రం అనేక కొర్రీలు పెట్టినప్పటికీ గత్యంతరం లేక ఆయా రాష్ట్రాలు అప్పులు చేసి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు కరోనా మృతులకు కేంద్రం గతంలో 4లక్షల సాయం చేస్తామని ప్రకటించి ఆ తర్వాత చేతులెత్తిసింది. ఈ విషయంలోనే పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.దీనిపై సుప్రీం ఇటీవలే కేంద్రానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. కరోనా మృతులకు చెల్లించే ఎక్స్ గ్రేషియో విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు మధ్య వాదనలు కొన్నినెలలుగా నడుస్తున్నాయి. కేంద్రం ఎంతో కొంత చెల్లించకపోతే సుప్రీంకోర్టే ఎక్స్ గ్రేషియాను డిసైడ్ చేసే అవకాశం ఉంది. దీంతో కేంద్రం ఎట్టకేలకు కరోనా మృతులకు 50వేల పరిహారం అందిస్తామని కోర్టుకు విన్నవించుకుంది. అయితే ఈ భారాన్ని కూడా కేంద్రం తనపై పడకుండా రాష్ట్రాల మోపడం చర్చనీయాంశంగా మారింది. కరోనా మృతులకు ఎక్స్ గ్రేషియాను ఆయా రాష్ట్రాలు తమ విపత్తు స్పందన నిధుల నుంచి ఖర్చు చేయాలని కేంద్రం సూచించినట్లు కోర్టుకు విన్నవించింది. ఈమేరకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నామని పేర్కొంది. తద్వారా కేంద్రం కరోనా సాయం విషయంలో తన చేతికి మట్టి అంటకుండా రాష్ట్రాలపై భారం మోపేసింది. కేంద్రం కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయకుండానే పేరును మాత్రం తన ఖాతాలో వేసుకోనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే..!

Related Posts