YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

2 ఏళ్ల ముందే అభ్యర్ధుల ప్రకటన

2 ఏళ్ల ముందే అభ్యర్ధుల ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 30, 
తెలంగాణ బీజేపీ  సరికొత్త ప్లాన్.. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే కీలక ప్రకటన చేయనుంది. హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడమే ఆలస్యం.. ఇంతకీ ఏంటా నిర్ణయం? బండి వ్యూహం సక్సెస్ అవుతుందా? లేక మొదటికే మోసం వస్తుందా? తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా కమలనాథులు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. హైకమాండ్‌ నుంచి కూడా ఫుల్‌ సపోర్ట్ లభిస్తుండటంతో సరికొత్త ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ జనాల్లోకి వెళ్లారు. త్వరలోనే తొలివిడత పాదయాత్ర ముగియనుంది. ఈలోపే కీలక ప్రకటనకు స్కెచ్‌ వేస్తున్నారు.ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్ని పార్టీలకంటే ముందే బండి సంజయ్ జనంలోకి వెళ్లారు. 5 విడతల్లో సంగ్రామయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి హుజురాబాద్ వరకు తొలి విడత. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర ముగిసింది. సిరిసిల్ల మీదుగా హుజూరాబాద్ వరకు కొనసాగుతోంది. అక్టోబర్2న మొదటి విడత పాదయాత్ర ముగిస్తారు. ఈ ముగింపు సభలోనే 20 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట కమలనాథులు. ఎటువంటి సమస్య లేని, పెద్దగా ఆశావహులు లేని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.పాదయాత్ర విజయవంతానికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలని బండి సంజయ్ భావిస్తున్న తెలుస్తోంది. పాదయాత్ర సాగిన జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంకా హైకమాండ్‌ నుంచి అనుమతి రాలేదు. ఢిల్లీ పెద్దలు ఓకే అంటే ఆ వెంటనే ప్రకటన ఉంటుందని కమలం పార్టీ నేతలు చెప్తున్నారు. మరి బండి సంజయ్ జాబితాలో ఎవరి పేర్లున్నాయన్నదానిపై నేతల్లో టెన్షన్ నెలకొంది.2 ఏళ్ల ముందే క్యాండిడేట్లను ప్రకటిస్తే.. ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్లొచ్చనేది కమలనాథుల వ్యూహం. అయితే ముందే ప్రకటిస్తే మొదటికే మోసం వస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇంత ముందస్తు సరికాదని కొందరు పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్లాన్‌ రివర్స్‌ అయి నియోజకవర్గాల్లో అసంతృప్తి వెల్లువెత్తితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ముందస్తుపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

Related Posts