YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎత్తుగడలల్లో గులాబీ నేతలు

ఎత్తుగడలల్లో గులాబీ నేతలు

కరీంనగర్, సెప్టెంబర్ 30, 
ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో తెలంగాణలో పొలిటికల్‌ పార్టీల దృష్టి హుజురాబాద్‌పై పడింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు రెండూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్‌ తరఫున.. గులాబీ దళపతి ప్రచారం చేస్తారా? సీఎం కేసీఆర్‌ వ్యూహం ఏంటి?టాప్‌ గేర్‌లో ఉన్న హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారానికి EC ప్రకటన మరింత ఊపు నిచ్చింది. ఫీల్డ్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహం వచ్చింది. ఇప్పుడా అప్పుడా అని ఊరిస్తూ వస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ ఎట్టకేలకు రిలీజ్‌ కావడంతో అందరి దృష్టీ అక్టోబర్‌ 30న జరగే పోలింగ్‌పై నెలకొంది. ఇంకా నెలరోజులే సమయం ఉంది. జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రచారం లెక్క ఒకటైతే.. రాబోయే నెలరోజులపాటు సాగే ప్రచార ఉద్ధృతి మరో లెక్క. రెండుపార్టీలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయి. ఈ కీలక సమయంలో టీఆర్ఎస్‌ తరఫున ఎన్నికల ప్రచారానికి గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ వెళ్తారా లేదా అన్నది బిగ్‌ టాపిక్‌గా మారిందిహజురాబాద్‌ ఉపఎన్నిక బ్యాక్‌ డ్రాప్‌లోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. ఆ పథకాన్ని హుజురాబాద్‌లోనే అట్టహాసంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రచారానికి ఎప్పుడో జెండా ఉపేశారు. కాకపోతే ఇప్పుడు షెడ్యూల్‌ వచ్చింది. షెడ్యూల్‌ వచ్చాక సీఎం కేసీఆర్‌ ఏం చేస్తారన్నది ప్రశ్నగా ఉంది. మంత్రి హరీష్‌రావు, పార్టీ సీనియర్‌ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లు హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. మండలానికో మంత్రి, ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు ఇంఛార్జులుగా ఉన్నారు. షెడ్యూల్‌ రాకముందే గెల్లు శ్రీనివాసయాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది అధికార పార్టీ.గతంలో రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలకు భిన్నంగా హుజురాబాద్‌ బై ఎలక్షన్‌ను డీల్ చేస్తోంది టీఆర్ఎస్‌. దుబ్బాక ఉపఎన్నిక జరిగినప్పుడు కేసీఆర్‌ ప్రచారానికి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉండి పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేసినా.. అనుకూల ఫలితం రాలేదు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు వచ్చే సరికి వ్యూహం మారింది. ఉపఎన్నికకు ముందు ఒకసారి.. తర్వాత మరోసారి నాగార్జునసాగర్‌లో పర్యటించారు గులాబీ బాస్‌. దళితబంధు పథకం ప్రారంభోత్సవం ద్వారా ఇప్పటికే ఒకదఫా హుజురాబాద్‌ను చుట్టేసిన కేసీఆర్‌.. ఇప్పుడేం చేస్తారు? బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ బలమైన అభ్యర్థిగా బరిలో ఉండటంతో.. మరోసారి అక్కడికి వెళ్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్‌ ప్రచార ఎత్తుగడలో ఏదైనా జరగొచ్చా?అక్టోబర్‌ 30న పోలింగ్‌ కావడంతో.. ఆ తేదీ దగ్గర పడిన సమయంలో సీఎం కేసీఆర్‌ హుజురాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించొచ్చని టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దానిపై ఎవరి దగ్గరా క్లారిటీ లేదు. ప్రత్యర్థి ఈటలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతోంది. అందులో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రచార ఎత్తుగడలో ఏదైనా జరగొచ్చని టాక్‌. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అవసరం అనుకుంటే అధినేతే స్వయంగా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts