నల్లగొండ
రోడ్లపై ప్రమాదాలు జరగకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడక్కడ బారిగేట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ బారిగేట్లపై ఆగి వెళ్లుము.. చూసి వెళ్లుము, వేగం కన్నా.. ప్రాణం మిన్న వంటి సూక్తులు రాస్తుంటారు. కానీ, చిట్యాలలోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై బస్టాండ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేట్పై పోలీసులు వినూత్న హెచ్చరికను రాయించారు. స్త్రీలను కాదు.. బండి రోడ్డువైపు చూసి నడుపు అని బారిగేట్పై రాసి ఉంది. దీనిని చూసిన వాహనదారులు నవ్వుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు మాత్రం దీన్ని దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా