YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మంగళవారం ఎన్జీవోల ధర్నా

మంగళవారం ఎన్జీవోల ధర్నా

మంగళవారం నాడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యోగులు ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారని   ఎపి ఎన్జీఓస్ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు.సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా పూర్తిగా రాజకీయ అంశం. అందుకే ఉద్యమానికి వెనుకాముందు ఆలోచిస్తున్నాం. మేం బయటకు వచ్చి ఉద్యమం చేయకుంటే హోదా వచ్చే పరిస్ధితి లేని నేపధ్యంలో మేం కూడా ఉద్యమం లోకి రావాలని నిర్ణయించామని అయన అన్నారు. పరిపాలన వ్యవస్థ ను, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా  కార్యక్రమాలు చేపట్టనున్నాం. నా బెంగుళూరు పర్యటనపై తనపై ఊహాగానాలు, అపోహలు వినివస్తున్నాయి.  మోడి ప్రభుత్వం ఎపికి ఎలాంటి నష్టం జరుగుతుందో మాత్రమే చెప్పాం....ఎవరికి ఓటువేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో ఎక్కడా మేము చెప్పలేదని అయన అన్నారు. సమైక్య రాష్ట్రం ఉద్యమ సమయంలో లేని అభ్యంతరం ఇప్పుడెందుకో బిజెపి నేతలు చెప్పాలని అయన డిమాండ్ చేసారు. రూల్స్ గురించి మాకు తెలుసు. మరొకరు మాకు చెప్పాల్సిన పనిలేదు....చౌకబారు విమర్శలు మానుకుంటే మంచిది. ఎన్నికల కమిషన్ అనుమతితో బెంగుళూరులో సమావేశం నిర్వహించాం. రాష్ట్ర ప్రజల సమస్యపైనే మాట్లాడాం. రాజకీయాల గురించి మాట్లాడలేదు.  రామచంద్రయ్య, రాధామాధవ్ ఎన్నికల సమయంలో ఎన్జీఓలు గా మా మద్దతు తీసుకున్నప్పుడు రూల్స్ బిజెపి నేతలకు గుర్తుకు రాలేదా అని అశోక్ బాబు నిలదీసారు.  టిడిపికి తొత్తుగా వ్యవహరిస్తున్నానంటూ కొందరు మాట్లాడుతున్నారు...ఉద్యోగులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వానికి సపోర్టుగా ఉంటే తప్పేంటని అన్నారు.  ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమే. మేం తిరగబడలేక కాదు. .మేం తిరగబడితే పరిస్ధితి మరోలా ఉంటుందని అయన అన్నారు. వచ్చే వారం జెఎసి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం....రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగులుగా మా వంతు కృషి చేస్తామని అన్నారు. మోడి ప్రభుత్వం పై పోరాటం చేస్తాం.. రాష్ట్రం ముఖ్యమా, పార్టి ముఖ్యమా అనేది ఎపి బిజేపి నేతలు తేల్చుకోవాలని అయన అన్నారు. 

Related Posts