న్యూఢిల్లీ సెప్టెంబర్ 30
ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల లేదా ఒక పీజీ మెడికల్ ఇన్స్‌టిట్యూషన్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌లో గురువారం నాలుగు, బన్‌స్వారా, సిరోహి, హనుమాన్‌ఘర్, దౌసా జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. వీడియో కాన్‌రెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణా చర్యలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్బంగా జైపూర్‌లో ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ కాలేజీకి కూడా మోదీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ప్రదాని మాట్లాడుతూ ఇటీవల ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్ ఆరోగ్య సేవలను ప్రారంభించామని, ఆ సేవలను దేశమంతా విస్తరించామన్నారు. హాస్పిటళ్లు, ల్యాబ్‌లు, ఫార్మసీలన్నింటినీ ఒక క్లిక్‌తో విజిట్ చేయవచ్చు అని తెలిపారు. డిజిటల్ హెల్త్ మిషన్‌తో రోగుల మెడికల్ డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంచవచ్చు అని ప్రధాని తెలిపారు. దేశంలోని ఆరోగ్య రంగాన్ని మార్చేందుకు జాతీయ ఆరోగ్య విధానాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు ఆరోగ్య రంగ అవసరాలను గుర్తు చేసిందన్నారు. ప్రతి దేశం ఆ సంక్షోభాన్ని తమదైన రీతిలో ఎదుర్కొన్నట్లు చెప్పారు. మహమ్మారి వేళ భారత తన శక్తిని, ఆత్మరక్షణను పెంచుకుందన్నారు.రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తనపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. ఇద్దరమూ భిన్నమైన పార్టీలకు చెందినవాళ్లమని, ఐడియాలజీలు భిన్నమైనవని, కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి ఇదే అని మోదీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం గెహ్లాట్ కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు.