మంత్రి పేర్ని నానిని అడ్డుకున్న జనసేన శ్రేణులు
తణుకు
పశ్చిమగోదావరి జిల్లాలోని… తణుకు ప్రాంతంలో మంత్రి పేర్ని నాని కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు జనసేన పార్టీ నాయకులు. దీంతో తణుకు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి పేర్ని నాని వెనక్కి తీసుకోవాలని అలాగే క్షమాపణలు కూడా చెప్పాలని నిరసనకు దిగారు జనసేన కార్యకర్తలు. ఇక ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి… మంత్రి కాన్వాయ్ కి దారిని సుగమం చేశారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అంతకు ముందు మంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టతీవ్రతపై అంచనా వేశారు.