ముగిసిన భవానీ పూర్ పోలింగ్
కోల్ కత్తా, సెప్టెంబర్ 30,
భవానీపూర్‌లో బైపోల్ హీట్.. ఉప ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. సీఎం మమతా బెనర్జీకి పోటీగా బీజేపీ నుంచి లాయర్ ప్రియాంక టిబ్రేవాల్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా పోటాపోటీ నెలకొంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు.భవానీ పూర్‌తో పాటు జాంగీపుర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఉప ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో బెంగాల్ అంటే రాజకీయ హింసగా మారిపోయిన తరుణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు అధికారులు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు భవానీ పూర్‌లో 57శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. నందిగ్రామ్‌లో సుబేందు అధికారి చేతిలో ఓడిపోయిన మమత..6 నెలల్లోగా ఎమ్మ్యెల్యేగా ఎన్నికల కావలసి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.మరోవైపు ఒడిశాలోని పిప్లీలోనూ ఉపఎన్నిక జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఐదు గంటల వరకు వరకు 54శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదైంది.