YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతులను ఆందోళన విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

రైతులను ఆందోళన విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

రైతులను ఆందోళన విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
* రహదారులపై నిరసనలు ఎలా చేపడతారు
* కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు కోర్టు చివాట్లు
 న్యూఢిల్లీ సెప్టెంబర్ 30
రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది.. రహదారులపై నిరసనలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ ఫోరం, పార్లమెంటరీ చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించామని, చర్చలకు నిరసనకారులు నిరాకరించారని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ కోర్టులు సూచించిన వాటిని మీరు అమలు చేయాల్సి పేర్కొంది. అయితే ఈ కేసులో ఎవరైనా పార్టీ కావాలని మీరు కోరుకుంటే.. పిటిషన్‌ దాఖలు చేయాలని చెప్పింది. ఈ మేరకు రైతులను ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేయగా.. ఇందుకు సంబంధించి పిటిషన్‌ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
అంతకు ముందు హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేసేందుకు నిరసన తెలుపుతున్న రైతులను ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఆందోళన సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్‌ను రైతులు కలువలేదని హర్యానా సర్కారు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా.. నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనతో నోయిడా – ఢిల్లీని కలిపే రహదారులు మూతపడ్డాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లు తెరవాలని పిటిషన్‌లో కోరారు.

Related Posts