తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో అక్టోబర్ 1 నుంచి సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘ఒరేయ్ బామ్మర్ది’
తెలుగు వారికి తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.ఇందులో లేటెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘ఒరేయ్ బామ్మర్ది’ అక్టోబర్ 1 నుంచి ప్రీమియర్‌గా విడుదలవుతుంది. సిద్ధార్థ్, జి.వి.ప్రకాశ్‌కుమార్, కరిష్మా పరదేశి, లిజోమోల్ జోషి, దీపా రామానుమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ హిట్ చిత్రం ‘శివప్పు మంజల్ పచ్చై’కు ఇది తెలుగు వెర్షన్. బిచ్చగాడు, శీను, రోజా పూలు వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల డైరెక్టర్ శశి.. ఒరేయ్ బామ్మర్దిని తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.
‘ఒరేయ్ బామ్మర్ది’ ిసనిమా విషయానికి వస్తే రాజ్యలక్ష్మి అనే అమ్మాయి తన భర్త రాజశేఖర్, తన తమ్ముడు మదన్ పడే ఘర్షణల నడుమ ఎవరికీ సర్ది చెప్పలేక బాధపడుతుంటుంది. మదన్ బైక్ రేసర్. బైక్‌ను వేగంగా నడుపుతూ రోడ్డుపై తను చేసే సాహసాల కారణంగా ట్రాఫిక్ సమస్యలను క్రియేట్ చేస్తుంటాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అయిన రాజశేఖర్‌కు ఇది నచ్చదు. అయితే అనుకోకుండా ఇద్దరూ బావ, బామర్దిలవుతారు. మరి రాజ్యలక్ష్మి వీరి మధ్య ఉండే దూరాన్ని తగ్గించగలిగిందా? బావ రాజశేఖర్‌తో ఉన్న గొడవలను మదన్ మరచిపోయాడా? బైక్ రేసింగ్‌ను విడిచిపెట్టేశాడా? అనే విషయాల గురించి చెప్పే చిత్రమే ఒరేయ్ బామ్మర్ది
పాత్రలను డెప్త్‌గా రాసుకుని, వాటిని ఎమోషన్స్‌ను మిక్స్ చేసి, వాటిని మానవ సంబంధాలు రిలేట్ అయ్యే తెరకెక్కించగల దర్శకుడు శశి. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఒరేయ్ బామ్మర్ది ఊహించని మలుపులతో రెగ్యులర్ ఫ్యామిలీ చిత్రాలకు భిన్నంగా రూపొందించబడింది. సిద్ధార్థ్, జి.వి.ప్రకాశ్, కరిష్మా పరదేశి, లిజోమోల్ జోషి వారి పెర్ఫామెన్స్‌లతో పాత్రలకు ప్రాణం పోశారు. శాన్ లోకేశ్ ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధు కుమార్ సంగీతాన్ని అందించారు. రమేశ్ పి.పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించారు.
2021 ఏడాదిలో ‘ఆహా’ ... క్రాక్, ఎస్.ఆర్.కళ్యాణ మండపం, వాహనములు నిలుపరాదు, లెవన్త్ అవర్, జాంబిరెడ్డి, చావు కబురు చల్లగా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, నీడ, కాలా, ఆహా భోజనంబు, వన్, సూపర్ డీలక్స్, చతుర్ ముఖం, కుడి ఎడమైతే, తరగతిగది దాటి, ది బేకర్ అంద్ ది బ్యూటీ, మహా గణేశ, ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలు, వెబ్ షోస్‌లతో ప్రతి ఒక తెలుగువారి ఇంట తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ భాగమైంది.