కొత్త పార్టీ ఏర్పాటు పనుల్లో ఆనందయ్య బిజీ బిజీ..
అఖిల భారత యాదవ సమాఖ్య నాయకులతో సమీక్షలు..!
నెల్లూరు
కొవిడ్ రెండో దశలో.. మందు పంపిణీ చేసి గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. బీసీల కోసం పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగిపోయారు. రాజకీయ పార్టీ ఏర్పాటు పనుల్లో ఆనందయ్య బిజీ బిజీగా మారిపోయాడు. నెల్లూరు జిల్లాల్లో అఖిల భారత యాదవ సమాఖ్య సమీక్షలు ఏర్పాటు చేసేదుకు సిద్ధమవుతున్నారు. గురువారం నాడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో యాదవ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు.
అందరితో చర్చించిన తర్వత బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే పార్టీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే రోజు పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో ఓ టీమ్ ఇదే పనిలో ఉన్నట్లుగా సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 13 జిల్లాల్లో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.