YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ సన్యాసం తీసుకుంటున్న జేసీ

 రాజకీయ సన్యాసం తీసుకుంటున్న జేసీ

 రాజకీయ సన్యాసం తీసుకుంటున్న జేసీ
అనంతపురం, అక్టోబరు 2,
జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ బ్యాలన్స్ తప్పి మాట్లాడుతుంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తారు. ఇప్పుడు జేసీ కుటుంబం అధికారానికి దూరమయింది. పార్టీ కూడా వారిని దూరం పెట్టింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి లో వైరాగ్యం కన్పిస్తుంది. సమాజం, రాజకీయం అంతా చెడిపోయిందంటూ వేదాంత ధోరణికి వచ్చేశారు. జేసీ బ్రదర్స్ కు అధికారంలో ఉన్నప్పుడు సమాజం, రాజకీయం అనేవి కనపడలేదా? అని ప్రశ్నిస్తున్నారు.దశాబ్దాల కాలాల నుంచి జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలు వెలగపెడుతున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజకీయం ఏమాత్రం బాగా లేదంటున్నారు. సమాజం కూడా పూర్తిగా చెడిపోయిందన్న ధోరణికి వచ్చేశారు. చెడిపోయింది సమాజమా? లేక జేసీ రాజకీయమా? అన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి. దశాబ్దకాలాల వరకూ శాసించిన తాడిపత్రిని కోల్పోవడంతోనే జేసీ బ్రదర్స్ కు మతి చెల్లించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.జేసీ దివాకర్ రెడ్డి కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు అక్కడి రాజకీయాలు కూడా పడటం లేదు. ఇటు అధికారంలో ఉన్న వైసీపీ ఇబ్బందులు పెట్టడం, అటు సొంత పార్టీ అయిన టీడీపీలో తమకు మద్దతు కరువవ్వడంతో ఏపీని వదిలి తెలంగాణకు వస్తానని వ్యాఖ్యానించారు. అది సాధ్యమయ్యే పనేనా? తమకు పట్టున్న తాడిపత్రి ప్రాంతాన్ని వదిలి జేసీ కుటుంబం తెలంగాణకు షిఫ్ట్ అవుతామని చెప్పడం ఎవరిని బెదిరించడానికి?జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వారి వారసులే ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. వైసీపీ దెబ్బకు వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నెగ్గుకు రావడం కష్టమే. మొన్నటి ఎన్నికల్లోనే దారుణ ఓటమిని చవి చూసిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం టీడీపీ పట్టు సాధించేందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా? అన్నది స్పష్టమవుతుంది. టీడీపీ అధినాయకత్వాన్ని బెదిరించేందుకే జేసీ దివాకర్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తం మీద జేసీలో వేదాంత ధోరణి తాత్కాలికమే. పొలిటికల్ గా రైజ్ అయిన వెంటనే ఆయనకు రాజకీయాలు, సమాజం అందంగా కన్పించవచ్చు.

Related Posts