YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఒవైసీ రాజకీయాలతో... కమలం ఖుషీ

ఒవైసీ రాజకీయాలతో... కమలం ఖుషీ

ఒవైసీ రాజకీయాలతో... కమలం ఖుషీ
లక్నో, అక్టోబరు 2,
అసదుద్దీన్ ఒవైసీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని స్థానాలను దక్కించుకోవడంతో ఆయన అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం ను విస్తరించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ లో ఆయన పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాలు బీజేపీకి లబ్ది చేకూరుస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ లలో ముస్లిం ఓటర్లు కొంత ఎక్కువగానే ఉన్నారు. తొలి నుంచి ముస్లిం సామాజికకవర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేది. గుజరాత్ లో ఇప్పటికీ కాంగ్రెస్ వెంటే ఉంటూ వస్తుంది. బీజేపీ దశాబ్దాలుగా అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ముస్లిం ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. కారణం ఇక్కడ జాతీయ పార్టీలు తప్పించి మరో ప్రాంతీయపార్టీ బలమైనది లేకపోవడమే. అందుకే కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు. ఇక్కడ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ కే నష్టం చేకూరుస్తుంది.ఇక ఉత్తర్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ వెంటనే నడిచిన ముస్లిం సామాజికవర్గం తర్వాత సమాజ్ వాదీ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే ప్రియాంక గాంధీ ‍యూపీ కాంగ్రెస్ చీఫ్ గా వచ్చిన తర్వాత తిరిగి ముస్లిం సామాజికవర్గం కాంగ్రెస్ వైపు చూస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించుతున్నారు. ఇది సమాజ్ వాదీ పార్టీకి, కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందంటున్నారు.ఉత్తర్ ప్రదేశ్ లో 19 శాతం ఉన్న మైనారిటీ వర్గాలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ యూపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దాదాపు 80కి పైగా స్థానాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో బీజేపీ లాభపడితే అది అసదుద్దీన్ ఒవైసీ వల్లనేనని స్పష్టమవుతుంది. కానీ ఒవైసీ మాత్రం తన పార్టీ విస్తరణకు పోటీ చేయక తప్పడం లేదని, వంద స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నారు. మొత్తం మీద ఉత్తరాదిన ఒవైసీ దెబ్బ విపక్షాలకే తగిలేటట్లు ఉంది.

Related Posts