YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఆసియా కుబేరుల్లో హైదరాబాదీలు

ఆసియా కుబేరుల్లో  హైదరాబాదీలు

ఆసియా కుబేరుల్లో  హైదరాబాదీలు
హైదరాబాద్, అక్టోబరు 2,
దేశంలో  సంపన్నులు పెరుగుతున్నారు.  ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  కలిసి హురున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా విడుదల చేసిన రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 1,007 మంది స్థానం దక్కించుకున్నారు. కనీసం రూ. వెయ్యి కోట్ల సంపద ఉన్నవారికి ఈ  లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కింది.
ఈ లిస్టులో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి 56 మంది, మొత్తం తెలంగాణ నుంచి 63 మంది ఉన్నారు. కిందటేడాదితో పోలిస్తే ఈ సారి కొత్తగా ఎనిమిది మంది   యాడ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యంత సంపన్నుడుగా  దివీస్‌‌‌‌‌‌‌‌ ల్యాబోరేటరీస్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ మురళి దివి  నిలిచారు. ఆయన సంపద రూ. 79,000 కోట్లు. ఆ తర్వాత ప్లేస్‌‌‌‌‌‌‌‌లో  హెటిరో ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ బీ పార్థసారథి రెడ్డి ఉన్నారు. ఆయన సంపద రూ. 26,100 కోట్లు. కిందటేడాది  రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ సారి 179 మంది పెరిగారు. పదేళ్ల కిందట హురున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ ప్రకటించడం స్టార్టయ్యింది. తాజాగా 10 వ యాన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హురున్ లాంచ్ చేసింది. హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నవారు  గత పదేళ్లలో రోజుకి రూ. 2,020 కోట్ల సంపదను క్రియేట్ చేశారని హురున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా పేర్కొంది. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ కావాలంటే కనీసం రూ. 1,21,600 కోట్లు ఉండాలి. వరసగా పదో ఏట కూడా హురున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెంబర్ వన్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినేత ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబానీ ఉన్నారు. టెలికం, రిటైల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విస్తరిస్తుండడంతో  రిలయన్స్ షేర్లు ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్ చేశాయి. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 17 లక్షల కోట్లను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసింది. ముకేశ్ అంబానీ సంపద  గత ఏడాది కాలంలో 9 శాతం పెరిగి రూ. 7,18,000  కోట్లను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. హురున్ ఇండియా రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 5,05,900 కోట్లతో  గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదానీ  రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఈ ఏడాది వేగంగా  వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేసిన వారిలో అదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదానీ ముందున్నారు. ఆయన గత ఏడాది కాలంలో రోజుకి రూ. 1,002 కోట్లను క్రియేట్ చేశారు.  అదానీ గ్రూప్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్ రూ. 9 లక్షల కోట్లకు చేరుకుంది.  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ఆరు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఒక్క అదానీ పవర్ తప్ప మిగిలిన కంపెనీల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. లక్ష కోట్లను క్రాస్ చేశాయి. దేశంలో ఏ ఇతర ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్ కూడా గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదానీలా రూ. లక్ష కోట్లను దాటిన ఐదు కంపెనీలను క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. మొత్తం ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదానీ ఎదిగారు. ఐటీ కంపెనీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ శివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 లోనూ మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నారు. ఆయన సంపద గత ఏడాది కాలంలో 67 శాతం పెరిగి రూ. 2,36,600 కోట్లకు చేరుకుంది. హిందుజా గ్రూప్ శ్రీచంద్ పరమానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ) నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, అర్సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిట్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదో ప్లేస్‌‌లో ఉన్నారు. మిట్టల్‌‌  మొదటిసారిగా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 లో చోటు పొందారు. సీరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ సైరస్ పూనావాలా  ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, అవెన్యూ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ రాధాకిషన్ దమానీ ఏడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోఉన్నారు.  ఈ సారి నలుగురు సంపన్నులు హురున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 లో  చోటు దక్కించుకున్నారు. గౌతమ్ అదానీ బ్రదర్‌‌‌‌ వినోద్ శాంతిలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదానీ  ఎనిమిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందగా, హిందాల్కో బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళం బిర్లా తొమ్మిదో ప్లేస్‌‌లో ఉన్నారు.   సైబర్‌‌‌‌ సెక్యూరిటీ కంపెనీ స్కేలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫౌండర్ జే చౌదరీ పదో ప్లేస్‌‌లో ఉన్నారు.
మరిన్ని విషయాలు..

1) హురున్ ఇండియా రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 లో రూ.  లక్ష కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారు 13 మందికి చేరారు. కిందటేడాది లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ సారి కొత్తగా ఐదు మంది యాడ్ అయ్యారు.
2) దేశంలో 237 మంది బిలియనీర్లు ఉన్నారని హురున్ ప్రకటించింది. కొత్తగా 58 మంది బిలియనీర్లు యాడ్ అయ్యారని పేర్కొంది. పదేళ్ల కిందటితో పోలిస్తే దేశంలో బిలియనీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.  వచ్చే ఐదేళ్లలో మరో250 మంది బిలియనీర్లు తయారవుతారని,  పదేళ్లలో బిలియనీర్ల పరంగా యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా పోటీపడుతుందని  హురున్ అభిప్రాయపడింది.
3) హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 46 సెక్టార్ల నుంచి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లు ఉన్నారు. పదేళ్ల కిందట కేవలం 19 సెక్టార్ల నుంచే ఎంటర్ ప్రెనూర్లు ఉండేవారు. ఈ లిస్టులో ఫార్మా సెక్టార్ నుంచి 40 మంది ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లు యాడ్ అయ్యారు. ఆ తర్వాత కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ పెట్రోకెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (27), సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (22)  సెక్టార్ల నుంచి ఎక్కువ మంది ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లు చోటు సంపాదించారు.
4) ఈ సారి రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,007 మందికి చోటు దక్కగా ఇందులో 894 మంది తమ సంపదను పెంచుకున్నారు. వీరిలో 229 మంది కొత్త వారే. మొత్తం 113 మంది వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గింది. 51 మంది హురున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి  డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవుట్ అయ్యారు. ఆరుగురు మరణించారు.
5) రిచ్‌‌లిస్ట్‌‌లోని మొత్తం 659 మంది ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్లు సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేడ్ కావడం విశేషం. కిందటేడాది ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 530 గా ఉంది. ఈ సారి రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయిన వారిలో 75 శాతం మంది సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేడ్ కావడం విశేషం.
6)  గోద్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మితా వీ క్రిష్ణా (70) దేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు.  బయోటెక్ చైర్మన్ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మజుందార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా (68) అత్యంత ధనవంతురాలైన సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేడ్ వుమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచారు.
7) ఈ సారి రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. కన్ఫూల్లీయెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (36) యంగెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేడ్ వుమెన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచారు. మొత్తం 26 యూనికార్న్‌‌‌‌‌‌‌‌లకు చెందిన 46 మంది ఫౌండర్లు  హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో చోటు సంపాదించారు. ఇందులో  భారత్‌‌‌‌‌‌‌‌పే ఫౌండర్ శాశ్వత్‌‌‌‌‌‌‌‌ నాక్రాని కూడా ఉన్నారు. ఆయన వయసు కేవలం 23 కాగా, హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆయనే అందరి కంటే చిన్నవాడు. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్‌‌‌‌‌‌‌‌ సంపద రూ. 5,800 కోట్లకు పెరిగింది. ఆయన ఈ రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. బైజూస్ ఫౌండర్ బైజూ రవీంద్రన్ సంపద రూ. 24,300 కోట్లకు పెరగగా, రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆయన 67 స్థానానికి చేరుకున్నారు. ముందు ఆయన రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో 507 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉండేవారు. జెరోధా ఫౌండర్ నితిన్‌‌‌‌‌‌‌‌ కామత్‌‌‌‌‌‌‌‌ సంపద రూ. 25,600 కోట్లకు చేరుకుంది. కామత్ ఫ్యామిలీ హురున్ రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో  63 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. నితిన్ కామత్, బైజూ రవీంద్రన్ సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకేష్ జన్జన్వాలా(రూ.22,300 కోట్లు)ను దాటేయడం గమనార్హం. ప్రభుత్వం తెచ్చిన పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌‌‌‌‌ వలన  డిక్సన్‌‌‌‌‌‌‌‌ సునీల్ వచాని లాభపడ్డారు. ఆయన సంపద రూ.9,100 కోట్లకు పెరగగా, హురున్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో 190 ప్లేస్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నారు.
 

Related Posts