YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

హాయ్.. గుడ్ మార్నింగ్ అంటూ..మెసేజ్‌ల బెడద !

హాయ్.. గుడ్ మార్నింగ్ అంటూ..మెసేజ్‌ల బెడద !

- పొద్దున్నే లేచి స్మార్ట్ ఫోన్ చూస్తే చాలు.. 

- గుట్టల కొద్ది మెసేజ్‌లు - స్టోరేజీ స‌మ‌స్య‌లు 

 - ఫోన్ స్టోరేజీతో పాటు క్లౌడ్ స్టోరేజీలో కూడా

- గూగుల్ వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక

 ప్రతిఒక్కరి అరచేతిలో మెరిసే సాధనం స్మార్ట్‌ఫోన్. అలాంటి స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు ‘గుడ్ మార్నింగ్‌’ మెసేజ్‌ల బెడద వెంటాడుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ యూజర్లే ఈ మెసేజ్‌ల బెడద ఎక్కువగా ఉన్నట్టు ఓ సర్వే వెల్లడించింది. మనం పొద్దున్నే లేచి స్మార్ట్ ఫోన్ చూస్తే చాలు.. గుట్టల కొద్ది మెసేజ్‌లు హాయ్.. గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తుంటాయి. గుడ్ మార్నింగ్ చెప్పేందుకు ఫొటోలు, వీడియోలు జోడించి మరి మెసేజ్‌లు పంపుతుంటారు. దేశవ్యాప్తంగా భారత్‌లోని ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒక స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ సమస్యలు ఎదుర్కొంటోందని ఓ మీడియా నివేదించింది. గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల్లో పుష్పాలపై సూర్యరశ్మి, పసిబిడ్డల ఫొటోలు, పక్షులు, సూర్యాస్తమయం వంటి ఫొటోలు భారతీయులకు ఒకరోజులో మిలియన్లకొద్ది వెళుతున్నాయని, దీనివల్ల ఫోన్ స్టోరేజీతో పాటు క్లౌడ్ స్టోరేజీలో కూడా స్పేస్ స‌రిపోవడం లేద‌ని గూగుల్ వాల్ స్ట్రీట్ జనరల్ నివేదించింది. గుడ్ మార్నింగ్ ఫొటోలు, వీడియోల కోసం గూగుల్‌లో సెర్చ్ చేసే వారి సంఖ్య గ‌త ఐదేళ్ల‌లో ప‌ది రెట్లు పెరిగింద‌ని డబ్ల్యూఎస్‌జే పేర్కొంది.


ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉన్న భారత్‌లో నెలకు 200 మిలియన్ల మంది యూజర్లు ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్, వాట్సాప్‌ వినియోగిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఫేస్‌బుక్.. గత ఏడాది తమ వినియోగదారులకు గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు ఒకేసారి వెళ్లేలా సదుపాయం తీసుకొచ్చింది. భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్లు, డేటా ప్లాన్లు చౌకైన ధరలో లభ్యం కావడంతో వేలాదిమంది ప్రజలు ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. భార‌త‌దేశంలోని ప్ర‌తి మూడు స్మార్ట్‌ఫోన్ల‌లో ఒక ఫోన్ ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల కార‌ణంగా స్టోరేజీ స‌మ‌స్య‌లు ఎదుర్కుంటుండగా.. అమెరికాలో మాత్రం ప్ర‌తి ప‌ది ఫోన్ల‌లో ఒక‌టి ఈ స‌మ‌స్య ఎదుర్కుంటున్నట్టు డేటా స్టోరేజీ సంస్థ వెస్టరన్ డిజిటల్ కార్పొరేషన్ తమ సర్వేలో వెల్లడించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఒక్క భారత్‌లోనే 20 బిలియన్లకు పైగా న్యూ ఇయర్ మెసేజ్‌లు పంపుకున్నట్టు వాట్సాప్ సంస్థ ఇటీవలే వెల్లడించింది. 

 

Related Posts