రేవంత్ 50 పర్సెంట్ సక్సెస్
హైద్రాబాద్, అక్టోబరు 2,
వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నాక తన ఖాతాలో తొలి ప్లస్ పాయింట్ ను జమ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏకం చేయాలన్న విషయాన్ని పక్కన పెడితే తొలుత కేసీఆర్ వ్యతిరేకులందరీని ఒకే వేదికపై తీసుకురావాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం సక్సెస్ అవుతున్నట్లే కన్పిస్తుంది. కోదండరామ్, వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పట్ల అనుకూల ధోరణని వ్యవహరిచండం ఇందుకు ఉదాహరణ.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినా తర్వాత వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కు దూరమయ్యాయి. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విడిగా పోటీ చేశాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అయితే కమ్యునిస్టు పార్టీలలో ఒకైటైన సీపీఐ ఏకంగా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. సీపీఎం కూడా మద్దతు విషయాన్ని స్థానిక నాయకత్వానికే వదిలేసింది. ఇక అనేక కార్యక్రమాల్లో వామపక్షాలు కాంగ్రెస్ తో కలసి నడవలేదు.అయితే ఇప్పుడిప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ వెంట నడిచేందుకు కమ్యునిస్టు పార్టీలు ముందుకు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు ఈ పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలించేవే. హుజూరాబాద్ లో కమ్యునిస్టు పార్టీలు పోటీకి దింపకుండా రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో కలసి వెళదామని, హుజూూరాబాద్ లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కోరుతున్నారు.బీజేపీ కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలకు టీఆర్ఎస్ మద్దతిస్తుండటంతో కమ్యునిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. ఇటీవల భారత్ బంద్ సందర్భంగా ఏపీలో అధికార వైసీపీ బంద్ కు మద్దతిచ్చినా ఇక్కడ ఇవ్వకపోవడాన్ని వామపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. హుజూరాబాద్ లో వామపక్ష పార్టీలు బరిలోకి తమ అభ్యర్థులను బరిలోకి దించకపోతే రేవంత్ రెడ్డి చాలా వరకూ సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి.ఇక నెక్స్ట్ర ఏంటీ
కాస్త పార్టీ ముందుకు వెళితే వెనక్కు లాగడం కాంగ్రెస్ పార్టీలో షరా మామూలే. అధికారాన్ని కోల్పోయి పదేళ్లవుతున్నా నేతలకు మాత్రం కలసి విజయం కోసం ప్రయత్నిద్దామన్న తాపత్రయం లేదు. తెలంగాణ కాంగ్రెస్ కు అధికారమిచ్చినా ఎక్కువ కాలం ప్రభుత్వం ఉండదన్న సంకేతాలను ప్రజల్లోకి ఆ పార్టీ నేతలే పంపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపునకు వెళ్లడమే ఇందుకు కారణం.ఇక తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత పార్టీ పరిస్థితి మెరుగుపడిందనే చెప్పాలి. గతంలో లేని విధంగా కాంగ్రెస్ క్యాడర్ రోడ్లమీదకు వస్తుంది. అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటుందని గుర్తించేలా పార్టీ కార్యక్రమాలు ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ట్వీట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార టీఆర్ఎస్ లో కొంత కంగారును పుట్టిస్తున్నాయి.అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య కూడా విభేధాలు తీవ్రమయ్యాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించేందుకు సీనియర్ నేతలు ఇష్టపడటం లేదు. తమను సంప్రదించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. మధుయాష్కి, గీతారెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు బహిరంగంగానే రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. మరికొందరు నేతలు పరోక్షంగా రేవంత్ రెడ్డికి సహకారం అందించడం లేదు.కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మూడోసారి కూడా ప్రజలు అధికారానికి దూరంగా పెట్టే అవకాశముంది. ఇలా పార్టీలోనే విభేదాలతో సతమతమవుతుంటే ఇక రాష్ట్రాన్ని ఏం ఏలతారన్న సందేశాన్ని వీరు ప్రజల్లోకి పంపేశారు. ఇప్పటికే డ్యామేజీ అయిన పార్టీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే కష్టమే. అలాంటి పరిస్థితుల్లో నేతలు రోడ్లమీద పడి పార్టీ పరువు తీస్తుంటే మరోసారి పార్టీని గాంధీ భవన్ కే పరిమితం చేస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.