YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీపీఎంతో కలిసి వైసీపీ పోటీ...?

సీపీఎంతో కలిసి వైసీపీ పోటీ...?

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 4,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈసారి పొత్తులకు సిద్ధమవుతున్నారా? ఒంటరిగా పోటీ చేయరా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ ఈసారి సీపీఎంను కలుపుకుని పోయే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. జగన్ కు ఒంటరిగా పోటీ చేసే శక్తి, సామర్థ్యం ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో సీపీఎం మద్దతు అవసరంగా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సమస్యలు ఎన్నికల నాటికి పరిష్కారం కావని, అప్పుడు వామపక్ష పార్టీ మద్దతు అవసరమన్నది జగన్ ఆలోచన.జగన్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. అటు చంద్రబాబు కూడా ఒంటరిగానే బరిలోకి దిగారు. జగన్ 151 స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. చంద్రబాబు ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారు. కుదిరితే జనసేన, బీజేపీతో కలసి పోటీ చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. కుదరకపోతే కమ్యునిస్టులను కలుపుకుని పోదామనుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం సీపీఎం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.కమ్యునిస్టులకు రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. కానీ వారి మద్దతు కొన్ని నియోజకవర్గాలలో అవసరం అవుతుంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో సీపీఎంకు కొంత పట్టుంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనిని జగన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ప్రధానిమోదీకి జగన్ రెండుసార్లు లేఖలు రాసినా అటు నుంచి రిప్లై లేదు. దీంతో విశాఖ వంటి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరిగినా పార్టీ ఇబ్బంది కూడదని జగన్ ఆలోచన చేస్తున్నారంటున్నారు.తొలినుంచి వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఆంధ్రప్రదేశ్ లో భిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. సీపీఐ చంద్రబాబుకు నేరుగా మద్దతు ఇస్తుంది. సీపీఎం మాత్రం అంశాల వారీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వైసీపీ పట్ల సీపీఎం కొంత సానుకూలంగా తొలి నుంచి ఉంది. అందుకే జగన్ సీపీఎం ఒక్క పార్టీని కలుపుకుని వచ్చే ఎన్నికల వెళ్లాలన్న యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 175 స్థానాల్లో సీపీఎంకు పది స్థానాలను ఇచ్చే అవకాశముంది. రాష్ట్ర విభజన తర్వాత శాససభలో సీపీఎం ప్రాతినిధ్యం లేకపోవడంతో వారు కూడా అంగీకరించే అవకాశాలే ఉన్నాయి.

Related Posts