YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వలసలు కోసం ఎదురుచూపులు

వలసలు  కోసం  ఎదురుచూపులు

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 4,
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలనుకుంటోంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలి మీద లేస్తుంది. అయినా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నోటాకు మించి ఓట్లు రాలేదు. కేంద్రంలో అధికారంలోకి రావడంతో బీజేపీ రాష్ట్రంలోనూ బలపడాలనుకుంది. తెలుగుదేశం పార్టీని బలహీన పర్చి తాను బలోపేతం కావాలనుకుంది.అయితే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయి కష్టాల్లో ఉండటంతో ఆ పార్టీని వీడే వారి సంఖ్య తొలినాళ్లలో ఎక్కువగా ఉంది. టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. వారి తర్వాత వరదాపురం సూరి, ఆదినారాయణరెడ్డిలు బీజేపీలో చేరిపోయారు. అంతే అక్కడి తో బీజేపీలో చేరే నేతలు ఆగిపోయారు. వరసబెట్టి తమ పార్టీలోకి వలసలు ఉంటాయని చెప్పిన బీజేపీ నేతల మాటలు ఒట్టిదేనని తేలిపోయింది.నిజానికి జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు లాంటి నేతలు కూడా బీజేపీ వైపు చూశారు. కన్నా లక్ష్మ్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వలసల జోరు ఎక్కువగా ఉంది. టీడీపీని బలహీనపర్చాలన్న ఉద్దేశ్యంతో ఎక్కువగా ఆ పార్టీ నుంచే నేతలను చేర్చుకునేందుకే ప్రయత్నించారు. టీడీపీ నుంచి ఎక్కువగా వలసలుంటాయని బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.ఎన్నికలు పూర్తయి 27 నెలలు గడవడం, ఏపీలో బీజేపీ బలపడుతుందన్న నమ్మకం లేకపోవడంతో ఆ పార్టీవైపు చూడటం లేదు. ఒకదశలో గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆయనకూడా వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీలోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తికనబర్చకపోవడానికి సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా నియామకం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీలో ఎటువంటి వలసలు లేక ఆ పార్టీ వెలవెలపోతుందనే చెప్పాలి.

Related Posts