YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బద్వేలులో పోటీకి బీజేపీ సై

బద్వేలులో పోటీకి  బీజేపీ సై

కడప, అక్టోబరు 4,
ఉప పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్నటి వరకూ అన్ని పార్టీలు ఈ ఎన్నికల పోటీలో ఉంటాయని భావించిన వారికి.. ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని జనసేన అధినేత పవన్ చేసిన ఊహించని ప్రకటనతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం అదే నిర్ణయాన్ని తీసుకుంది. తాము కూడా బద్వేల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం బద్వేల్ బరిలో ఉంటామని కరాఖండిగా తేల్చి చెబుతోంది. మిత్రపక్షమైన జనసేన పోటీ నుంచి తప్పుకున్నా.. తాము తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. తాజాగా బద్వేల్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో.. బీజేపీ అలర్ట్ అయ్యింది. పోటీకి జనసేన నై అన్నా.. బీజేపీ సై అంటోంది. ఇదే అంశంపై బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. బద్వేల్‌లో జనసేన అభ్యర్థిని పోటీ చేయమని తమ వైపు నుంచి కోరామన్నారు. అయితే, పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయని, వారి సిద్ధాంతం ప్రకారం బద్వేల్ ఉప పోరు నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన ప్రకటించిందన్నారు. మిత్రపక్షమైన జనసేన నిర్ణయాన్ని తాము వ్యతిరేకించబోమన్న సోమువీర్రాజు.. బీజేపీ కూడా సిద్ధాంతం ప్రకారమే ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. బద్వేల్ బరిలో నిలుస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జాతీయ అధినాయకత్వానికి సమాచారం అందించామన్నారు. అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.బీజేపీ, జనసేన ప్రజాక్షేత్రంలో కలిసి పని చేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం కుటుంబ రాజకీయాల్ని వ్యతిరేకిస్తుందని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా కుటుంబ పాలన వ్యవస్థ విస్తరించిందని, ఏపీలో కూడా కుటుంబ పాలన సాగుతోందని పేర్కొన్నారు. దానికి వ్యతిరేకిస్తూనే బద్వేల్ ఎన్నికల పోటీలో నిలవాలని నిర్ణయించామన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదించామన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఉప ఎన్నికలో ఎత్తి చూపుతామని సోము వీర్రాజు పేర్కొన్నారు. బద్వేల్‌లో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు కేటాయించిందన్నారు.

Related Posts