YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గీతారెడ్డి ఎక్కడ...

గీతారెడ్డి ఎక్కడ...

మెదక్, అక్టోబరు 4,
అదే గీతారెడ్డి.. అదే పొన్నాల లక్ష్మయ్య… దామోదర రాజనర్సింహ, మల్లు రవి, షబ్బీర్ అలి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో ఓల్డ్ ఏజ్ నేతలకు కొదవలేదు. కొన్ని దశాబ్దాలుగా ఓటర్లు వీరి ముఖమే చూస్తున్నారు. వరస ఓటములు ఎదురైనా వీరు మాత్రం తమ నియోజకవర్గాలను వదలడం లేదు. వచ్చే ఎన్నికలకు కూడా వీరే మరోసారి అభ్యర్థులయ్యే అవకాశాలే కన్పిస్తున్నాయి. మరి ముసలి కంపుతో కాంగ్రెస్ ఎలా బాగుపడుతుంది? అన్న ప్రశ్నలు తలెత్తుతుతున్నాయి.రాష్ట్ర విభజన జరగక ముందు రెండు, మూడు దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్న వారే నేటికీ కాంగ్రెస్ లో నాయకులుగా ఉన్నారు. వారి నియోజకవర్గాలలో మరొకరిని ఎదగనివ్వడం లేదు. ఒకవేళ ఎదిగినా కాంగ్రెస్ పార్టీ కదా.. వెంటనే తొక్కేసే కార్యక్రమం చేపడుతున్నారు. పార్టీని వీడిపోతే తప్ప అక్కడ కొత్త నాయకత్వానికి కాంగ్రెస్ లో అవకాశం దక్కడం లేదు. నాయకులు వారంతట వారు వెళితేనే మరో నాయకుడికి అవకాశం కలుగుతుంది.జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు తేడా అదే. ప్రాంతీయ పార్టీల్లో నిర్దాక్షిణ్యంగా పనికిరారనుకున్న నేతలను పక్కన పెడతారు. 70 ఏళ్లు దాటినా కాంగ్రెస్ నేతలు ఖద్దరు చొక్కా నలగకుండా తిరగాలనుకుంటున్నారు. జనంలోకి వెళ్లే పనిచేయరు. ఇప్పటికీ ఇంటి నుంచే రాజకీయం నడపాలనుకుంటారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అంతో ఇంతో పుంజుకుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కొంత కాంగ్రెస్ క్యాడర్ లో భరోసా కలిగింది.అయితే నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయి, జనాలకు దూరమైన నేతలను పక్కన పెట్టకపోతే కాంగ్రెస్ కు మరోసారి పరాభవం తప్పదు. కాంగ్రెస్ లో చాలా మంది అవుట్ డెటెడ్ నేతలున్నారు. వీరంతా అధికారంలోకి వస్తే మంత్రిపదవి కోసమో, ముఖ్యమంత్రి పదవి వస్తుందనే పోటీ చేస్తారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో వీరు గెలిచే అవకాశాలే కన్పించడం లేదు. ఇప్పుడు ప్రజలు యువతను కోరుకుంటున్నారు. 24/7 పనిచేసే నేతలను గెలిపించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముసలి నేతలను పక్కన పెట్టకపోతే కాంగ్రెస్ మరోసారి దూరమవ్వకతప్పదు.

Related Posts