YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా కు లక్షకుపైగా గా ఓట్ల మెజార్టీ తేవాలి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా కు లక్షకుపైగా గా ఓట్ల మెజార్టీ తేవాలి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కడప
ఉప ఎన్నికల బరిలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి సుధా కు లక్ష ఓట్లకు పైగా మెజార్టీ తీసుకు వచ్చే బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం బద్వేల్ బైపాస్ రోడ్డులో జరిగిన వైకాపా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల అన్ని విధాల ఆదుకున్నారని  ఈ విషయాన్ని ప్రజలకు ఓటర్లకు వివరించి చెప్పవలసిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందని అని తెలిపారు. ఉప ఎన్నికల్లో  అభ్యర్థి విజయం తథ్యమన్నారు. ఇప్పుడు మెజారిటీ పైనే నాయకులు కార్యకర్తలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
ఇందుకోసం సైనికుల పనిచేయాలని ఆయన కోరారు స్థానిక ఎమ్మెల్యే దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని గతంలో డాక్టర్ వెంకట సుబ్బయ్య కు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలని ఆయన కోరారు ప్రతి ఓటర్లు ను నాలుగైదు సార్లు కలవాలని మంత్రి కోరారు ఎన్నికల బరిలో ఏ పార్టీ అభ్యర్థి ఉన్నా తమ తమ పార్టీ అభ్యర్థి కి లక్షకుపైగా మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు ఈ విషయంలో నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని మంత్రి కోరారు సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు అంజాద్ బాషా నారాయణస్వామి  రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఎంపీలు అవినాష్ రెడ్డి రంగయ్య కడప జిల్లా ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాచమల్లు ప్రసాద్ రెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆడ చైర్మన్ గురు మాన్ బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి బద్వేల్ మార్కెట్ కమిటీ మార్కెట్ వైస్ చైర్మన్ రమణారెడ్డి బద్వేల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు సాయి కృష్ణ గోపాల స్వామి స్వామి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు

Related Posts