YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరోగ్య హామీ ప్రారంభ కార్య‌క్ర‌మాన్నిస‌మీక్షించిన ప్ర‌ధాన మంత్రి

ఆరోగ్య హామీ  ప్రారంభ కార్య‌క్ర‌మాన్నిస‌మీక్షించిన ప్ర‌ధాన మంత్రి

ఆయుష్మాన్ భార‌త్ లో భాగంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించే దిశ‌గా సాగుతున్న స‌న్నాహాల‌ తాలూకు పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మీక్షించారు.ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మం త్వ‌రితంతగా, సాఫీగా ఆరంభమయ్యేందుకు వీలుగా రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు స‌హా ఇంత‌వ‌ర‌కు జ‌రిగిన స‌న్నాహాల‌ పరంపరను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి దృష్టికితీసుకురావ‌డ‌మైంది.ఈ ప‌థ‌కం ఒక్కొక్క కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ర‌క్ష‌ణ‌ ను క‌ల్పిస్తుంది.  10 కోట్ల‌కు పైగా పేద, దుర్బల కుటుంబాల‌కు ర‌క్ష‌ణ‌ ను అందించడం ఈ పథకం యొక్క లక్ష్యంగా ఉంటుంది. స‌మాజం లోని పేద‌లు మ‌రియు అణ‌గారిన వ‌ర్గాల వారికి గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని ఈ ప‌థ‌కంలో భాగంగా అంద‌జేయాల‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ఇంకా పిఎమ్ ఒ ల అగ్రగామి అధికారులు ఈ ప‌థ‌కం యొక్క వివిధ అంశాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రికి తెలియజెప్పారు.ఆయుష్మాన్ భార‌త్ లో భాగంగా ఒక‌టో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంట‌ర్ ను ఛత్తీస్ గఢ్ లోని మ‌హ‌త్వాకాంక్ష క‌లిగిన జిల్లా అయిన‌టువంటి బీజాపుర్ లో ప్ర‌ధాన మంత్రి గత నెల‌లో ఆంబేడ్కర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్రారంభించారు.

Related Posts