కరీంనగర్ అక్టోబర్ 4
హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో ప్రధానపార్టీల అభ్యర్థులు, వందలాదిమంది నిరుద్యోగులతో పాటు పీల్డ్ అసి స్టెంట్లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.బరిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నత విద్యావంతు లు కావడమే ఇందుకు కారణం. అభ్యర్థి మొదలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో వచ్చిన మా ర్పుల దాకా అన్నీ ఈసారి ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో ఈసారి దాదాపు 1000 మంది వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.ప్రతీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల ధరావతు, అభ్యర్థికి మ ద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయా లి. వీరంతా పోటీ చేయాలంటే కనీసం రూ.కోటి నగదు,కనీసం 10వేలమంది స్థానికుల మద్దతు అవసరం. వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటామంటున్నారు. ఈ అందరికీ ధరావతు, స్థానికుల మద్దతు ఎంతమేరకు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.