మన దేశంలోని ప్రతీ దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత వుంది. అలాగే దక్షిణాదిన సముద్రతీరానున్న రామేశ్వర ఆలయానికి కొన్ని విశిష్టతలు వున్నవి. ఈ ప్రాచీన దేవాలయంలో నాలుగు శివలింగాలున్నవి. కాశీతో సమానమైన ఆలయం.
కాశీ శివలింగం..
రావణాసురుని సంహరించినందు వలన కలగిన బ్రహ్మ హత్యా దోషం తొలగించుకుందుకి ఈ లింగాన్ని శ్రీ రాముడు ప్రతిష్టించాడు. ఆంజనేయుడు ఈ శివలింగాన్ని కాశీ నుండి తీసుకునివచ్చినందున కాశీలింగంగా రామేశ్వరం లో పూజింపబడుతున్నది.
ఇసుక లింగం....
కాశీ లింగంతో సమానంగా పూజించబడే యీ లింగాన్ని తన పూజకై సీతాదేవి ఇసుకతో ప్రతిష్టించినది. ఇదే రామనాధస్వామిగా మూలవిగ్రహంగా దర్శనమిస్తున్నది.
ఉప్పు లింగం ...
భాస్కరరాయడు అనే అమ్మవారి భక్తుడు ప్రతిష్టించిన యీ లింగం అతి కఠినంగావుంటూ నీటికి కరుగక వజ్రలింగం అని పిలువబడుతున్నది.
ఈ శివలిగాన్ని పూజించినసర్వ వ్యాధులు గుణమౌతాయని భక్తుల ధృఢ విశ్వాసం.
స్ఫటిక లింగం....
గర్భగృహంలో ఆదిశంకరాచార్యులవారు ప్రతిష్టించారు. ఈ స్ఫటిక శివలింగానికి నిత్యం ఉదయాన 5 గం..నుండి సాయంకాలం 6 గం..వరకు
పాలభిషేకం జరుగుతుంది.