YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి కలవరపాటు

టీడీపీకి కలవరపాటు

విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌రు 5,
ఉత్తరాంధ్ర రాజకీయాలు టీడీపీకి కలవరపాటు కలిగిస్తున్నాయి. కంచుకోట కాస్తా మంచుకోటగా మారిపోతున్న వేళ దెబ్బ మీద దెబ్బ పడిపోతోంది. బిగ్ షాట్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఆయన వైసీపీకి జై కొడుతున్నారు. ఆయన వెంట ఎంతమంది టీడీపీ నుంచి వెళ్తారు అంటే చాలా పెద్ద లిస్ట్ ఇపుడు వినిపిస్తోంది. వీరంతా గుడ్ బై కొడితే మాత్రం పసుపు పార్టీ తట్టుకులేని భూకంపమే అంటున్నారు. విశాఖ జిల్లాలో కనీసం ఒక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును అనుసరించడం ఖాయమని అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురుకు తక్కువ కాకుండా ఉంటారట. ద్వితీయ శ్రేణి నాయకులకు అయితే కొదవ లేదు. వారు గంటా శ్రీనివాసరావు ఎటు అంటే తమ రూటే అటే అంటారు.గంటా శ్రీనివాసరావు ఎంపీగా అనకాపల్లి నుంచి ఒకసారి పనిచేశారు. దాంతో ఆయనకు రూరల్ జిల్లా అంతటా కొట్టిన పిండి. ఆయన వర్గం పెద్ద ఎత్తున ఉంది. వారికి పార్టీ పట్టింపు లేదు. గంటా శ్రీనివాసరావుయే వారి నాయకుడు. ఈ రకమైన కల్చర్ ఉత్తరాంధ్రాలో గంటా శ్రీనివాసరావు నుంచే మొదలైంది. ఆయన్ని చూసి రాజకీయం చేసే వారే విశాఖ రూరల్ జిల్లాలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు అనకాపల్లి, చోడవరం, భీమునిపట్నంల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. విశాఖ ఉత్తరం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ నాలుగు అసెంబ్లీ సీట్లో పెద్ద ఎత్తున అనుచర గణం గంటా శ్రీనివాసరావుకు ఉంది. ఇపుడు వీరంతా ఆయన ఎక్కడ ఉంటే తాము అక్కడే అంటున్నారు.ఇక విజయనగరం జిల్లాకు ఇంచార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావు వ్యవహరించారు. దాంతో ఇక్కడ ఆయన చక్రం కొన్నాళ్ళ పాటు గిరగిరా తిరిగింది. మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు వంటి వారు గంటా శ్రీనివాసరావు మాటే తమ బాట అంటారు. అలాగే బొబ్బిలి రాజులు కూడా గంటాకు మంచి మిత్రులు, మాజీ మంత్రి సుజయక్ క్రిష్ణ రంగారావు, సోదరుడు బేబీ నాయన కూడా చంద్రబాబు తీరు మీద తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది. దాంతో వీరు కనుక కీలక నిర్ణయం తీసుకుంటే విజయనగరం జిల్లాలో పార్టీ సగానికి సగం ఖాళీ అయినట్లే. అంతే కాదు, సాలూరు నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ పీ గిరిజన నేత భంజ్ దేవ్ సైతం గంటా శ్రీనివాసరావు వెంట నడిచే అవకాశం ఉందని అంటున్నారు.ఇక శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా ఊగిసలాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తమ మనిషి తోడుగా ఉంటే ఏ పార్టీలోకి అయినా వెళ్ళేందుకు రెడీ అంటున్నట్లుగా టాక్. ఇక ఇదే జిల్లాలో ఒక మాజీ మంత్రి కుటుంబం కూడా టీడీపీ పట్ల అసంత్రుప్తిగా ఉందని అంటున్నారు. వారు కనుక సైకిల్ దిగితే అతి పెద్ద నష్టం టీడీపీకి తప్పదు అంటున్నారు. మరో బిగ్ షాట్ కూడా గంటా శ్రీనివాసరావుతో గతంలో దోస్తీ చేసి వేరే పార్టీ మారి వచ్చిన వారే. ఆయన కూడా తన దారి తనది అంటే మాత్రం పసుపు పార్టీకి సిక్కోలులో చీకట్లు కమ్ముకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తూంటే తొందరలోనే అతి పెద్ద రాజకీయ సునామీయే ఉత్తరాంధ్రాలో వస్తుందని అంటున్నారు

Related Posts