YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ ట్రాప్ లో కేసీఆర్

రేవంత్ ట్రాప్ లో కేసీఆర్

హైదరాబాద్, అక్టోబరు 5,
కేసీఆర్ రాజకీయాలగురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు! వ్యూహాలు రచించడం సంగతి కాసేపు పక్కనపెడితే… తెలంగాణ ఉద్యమసమయంలో అన్ని పార్టీలనూ తన వెనక కుర్చోబెట్టుకున్న ఘనత కేసీఆర్ సొంతం. తెలంగాణ అంటే – టీఆరెస్… అనే స్థాయి ప్రచారంతో యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గ్రిప్ లో పెట్టుకున్న నైపుణ్యం కేసీఆర్ ది! అయితే… ఇప్పుడు ఆ నైపుణ్యం.. రేవంత్ ట్రాప్ లో పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!అవును… ఇంతకాలం తెలంగాణా రాజకీయాల్లో ఎదురులేని మనిషిగా.. తనకు సమకాలీకుడు – సమఉజ్జీ లేదనే స్థాయిలో కేసీఆర్ పొలిటికల్ కెరీర్ సాగుతుంది! తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటినుంచీ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి… కేసీఆర్ కు పెద్ద ట్రాపే వేస్తున్నారు. అది కూడా అత్యంత వ్యూహాత్మకంగా నడుస్తుంది! విచిత్రం ఏమిటంటే… ఆ ట్రాప్ లో కేసీఆర్ పడిపోతున్నారు!!తెలంగాణ ఉద్యమ అమరులంటే సీఎం కేసీఆర్‌కు ద్వేషం.. అమరులను ఎవరైనా తలుచుకుంటే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.. కేసీఆర్‌ కడుపులో ఇంత విషం ఉందని తాము ఊహించలేదు” ఇవి తాజాగా రేవంత్ చేసిన విమర్శలు! నిరుద్యోగ భృతి, ఖాళీ ఉద్యోగాల భర్తీ చేయాలన్న డిమాండ్‌తో రేవంత్ రెడ్డి.. విద్యార్థులను – నిరుద్యోగులను వెంటబెట్టుకుని నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే!ఈ కార్య్కాన్ని పోలీసులు అడ్డుకున్నారు! ఇప్పుడు నిరుద్యోగ సమస్య తెలంగాణలో అత్యంత భారీగా ఉంది. సుమారు 60వేల ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో ఏ విద్యార్థుల ఉద్యమాలవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో.. ఏ విద్యార్థుల ఐకమత్య పోరాటం వల్ల కేసీఆర్ సీఎం అయ్యారో.. వారిపైనే లాఠీచార్జ్ చెయ్యించడం కచ్చితంగా పెద్ద మిస్టేకే!మిగిలిన ర్యాలీలు – ధర్నాల కంటే… నిరుద్యోగ సమస్య అనే అస్త్రాన్నీ కేసీఆర్ పై సందించారు.. కేసీఆర్ కచ్చితంగా అడ్డుకుంటారని రేవంత్ భావించి ఉండొచ్చు! సరిగ్గా… ఆ ట్రాప్ లో కేసీఆర్ పడిపోయారు. దీంతో… తాను విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యమాలకే వాడుకుంటాను తప్ప… ఉద్యోగాలివ్వడానికి కాదనే సంకేతాలు కేసీఆర్ ఇచ్చినట్లయ్యింది!అలాకాకుండా… ఇప్పటికే ఆ ఉద్యోగాల భర్తీ చేయడమో – లేకపోతే కనీసం ఆ ర్యాలీని అడ్డుకోకుండా చేయడమో చేసి ఉంటే… కథ వేరేగా ఉండేది! కానీ… కేసీఆర్ అప్పటికే ట్రాప్ లో పడి చాలా సమయమే అయ్యింది!!

Related Posts