హైదరాబాద్
పోడు భూముల హక్కుల కోసం ఉద్యమిస్తున్న పోడు రైతుల కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పోడు రైతులకు పట్టాలిచ్చి వారికి భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో అఖిల పక్షం చేస్తున్న పోడు రాస్తారోఖో లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయండి. పోడు రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. పోడు రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి భూములపై చట్టపరంగా హక్కులు కల్పించాలని అయన అన్నారు.