మచిలీపట్నం
బందరు పోర్టు సాధనకై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు జరిగిన నిరసన దీక్షలో రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు పాల్గోన్నారు. జీవీఎల్ మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన బాధ్యతను విమర్శించింది. రాజకీయ ఉనికి లేకపోయినా బీజేపీ పోరాడుతూనే ఉంది. అనాదిగా మచిలీపట్నం వివక్షకు గురవుతూ వస్తోంది. పోర్టు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న చర్చ తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఐదుగురు సీఎంలు వచ్చి పోర్టుకు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. ఇటువంటి రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. సినిమా టికెట్ల అమ్మాలన్న శ్రద్ధ బందరు పోర్టు మీద పెడితే బాగుండేది. 2024లో మచిలీపట్నం ఎంపీగా బీజేపీని గెలిపిస్తే పోర్టు కలను సాకారం చేసి చూపిస్తాం. బందరు పోర్టు పేరుతో వైసీపీ, టీడీపీలు ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.