విజయవాడ
ఇంద్రకీలాద్రి లో దసరా ఉత్సవాల ఏర్పాట్ల ను జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మంగళవారం నాడు పరిశీలించారు. శనీశ్వరలయం నుండి మహామండపం వరకు క్యూ లైన్లు, స్నానపు ఘాట్ లు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ ఈ నెల 7 నుండి 15 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. గత సంవత్సరం మాదిరిగానే రోజుకు పదివేల మందికి టైం స్లాట్ ప్రకారం భక్తులకు అనుమతి ఇస్తాం. కోవిడ్ నేపథ్యంలో క్యూ లైన్లలో ఎక్కువ ప్రదేశాలలో సానిటైజర్స్ పాయింట్లు ఏర్పాటు చేసాం. ఈ సారి ఉత్సవాలలో హెలిప్యాడ్ రైడ్ ను అందుబాటులో కి తెచ్చాం. ఉత్సవాలకు వచ్చే భక్తులు విజయవాడ ను హెలిప్యాడ్ ద్వారా వీక్షించవచ్చని అన్నారు.
విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తు లో భాగంగా నాలుగుఅంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సారి కరోనా కారణంగా అన్నదాన కార్యక్రమం లేదు.. భక్తులకు పోట్లలా రూపంలో అన్నప్రసాదం అందచేస్తాం. మూల నక్షత్రం రోజు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు..