YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చకచకా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు

చకచకా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు

ఏలూరు
భారీ వరదలు పోటెత్తుతున్నా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు  శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి.  జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం  12 ప్రెజర్ టన్నెల్స్ వున్నాయి. ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ.  వెడల్పు 9మీ  వుంటుంది. అతి తక్కువ కాలంలోనే రెండవ  టన్నెల్ తవ్వకం పూర్తి అయింది. మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 21,39,639 క్యూబిక్ మీటర్ల కొండతవ్వకం పనులు పూర్తి చేసారు. పోలవరం జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి అయింది. జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్ టర్బైన్ ,ఒక్కో టర్బైన్ కెపాసిటీ  80 మెగా వాట్లు. అదేవిధంగా 12 ప్రెజర్ టన్నెల్,వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల కెపాసిటీ తో ఉంటుంది.  జెన్కో ఎస్ ఈ: ఎస్ శేషారెడ్డి టన్నెల్ తవ్వకం పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఈ లు ఏ.సోమయ్య,సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్,రాజేష్ కుమార్,మేనేజర్ మురళి తదితరులు పాల్గోంటున్నారు.

Related Posts