విశాఖపట్నం
విశాఖ ఏజెన్సీని కొత్త అం దాలు అల్లుకున్నాయి.పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు వస్తున్నట్లుగా మేఘాలు భువి నుంచి దిగి వచ్చి నేల పై కమ్ముకొచ్చాయి. కింద ఉన్న చెట్లు పచ్చనితివాచీని తలపించగా.. పైన మబ్బుల దుప్పటి కప్పినట్లు కను విందు చేసిన ఈ సుందర దృశ్యం ఆహ్లాదపరిచింది. ఒక అరకు... ఒక లంబసింగి... ఇలా ఏపీ లో ఉన్న అన్ని టూరిస్ట్ అట్రాక్షన్ అన్నీ వైజాగ్ ఏజన్సీలో దాగి ఉన్న అం దాలు.అసలు ఈ రెండు ఊర్లే కాకుం డా వైజాగ్ సిటీ కూడా చాలా అద్భుతం గా ఉంటుంది. అది ఒక అద్భుతమైన టూరిస్ట్ అట్రాక్షన్ అనే చెప్పాలి..ఇది లా ఉండగా ఇప్పుడు అక్కడ మరొక కొత్త హిల్ స్టేషన్ వంజంగి. చూడడానికి మాత్రం అద్భు తంగా ఉంటుంది. ఈ ఊరు పాడేరు మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి 6 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది 3400 అడుగులు సముద్ర మట్టం కంటే ఎత్తు లో ఉంది. ఈ హిల్ స్టేషన్ లో ఉండి సన్ రైజ్ గనక చూస్తే ఆ ఫీలింగే వేరు. దానిని మాటల్లో వర్ణించ లేము. మబ్బు ల మధ్యలో ఉన్నామా అనే ఫీలింగ్ రాక తప్పదు.