ముంబై అక్టోబర్ 5
ఇండియన్ ప్రిమియర్ లీగ్( ఐపిఎల్ )లో వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ రాబోతున్న నేపద్యం లో ఈ కొత్త ఫ్రాంచైజీలను ఈ నెల 25న బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. వీటిలో ఒక్కో టీమ్ కనీస ధరను రూ.2 వేల కోట్లుగా నిర్ధారించారు. అయితే ఈ ధర 50 నుంచి 100 శాతం పెరగొచ్చని ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కోఓనర్ నెస్ వాడియా అంచనా వేశారు. ఆ లెక్కన ఒక్కో టీమ్ రూ.3000 కోట్ల నుంచి రూ.4000 కోట్ల వరకూ పలకవచ్చని ఆయన అన్నారు. ఈ రెండు కొత్త టీమ్స్ రాకతో ఐపీఎల్ విలువతోపాటు ఇప్పుడున్న ఫ్రాంచైజీల విలువ కూడా పెరుగుతుందని నెస్ వాడియా అభిప్రాయపడ్డారు.ఐపీఎల్‌లో నాకున్న అనుభవం, కొద్దిపాటి నాలెడ్జ్‌తో చెబుతున్నా.. చాలా ఆలోచించే బీసీసీఐ ఈ కనీస ధరను నిర్ణయించింది. ఇది నాకు తెలిసి 50 నుంచి 100 శాతం పెరగొచ్చు. కనీసం రూ.3 వేల కోట్లపైనే ఉంటుంది అని నెస్ వాడియా అన్నారు. అందరూ ఐపీఎల్‌లో ఆడాలనుకుంటారు కానీ.. కొందరికీ ఆ అవకాశం వస్తుంది అని వాడియా అభిప్రాయపడ్డారు. రెండు కొత్త టీమ్స్ చేరిక అనేది ఐపీఎల్‌తోపాటు ఇప్పుడున్న ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లకు కూడా మంచే చేస్తుందని అన్నారు. ఓ మంచి లొకేషన్‌లో బిల్డింగ్ ఉండి, మీ చుట్టూ బాగా డెవలప్ అవుతుంటే మీ వాల్యూ ఎలా పెరుగుతుందో ఇప్పుడూ అదే జరుగుతుందని చెప్పారు.