లక్నో అక్టోబర్ 5
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో మంగళవారం చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్ పోలీసుల ప్రవర్తనపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఆయన ఫ్లోర్‌పై కూర్చుని ధర్నా చేపట్టారు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన ఘటనను ఖండిస్తూ ఆయన యూపీ పర్యటనకు వచ్చారు. ఎటువంటి ఆదేశాలు లేకున్నా.. తనను విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు భూపేశ్ భగల్ తెలిపారు. లఖింపూర్‌లో కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకురావడం వల్ల అక్కడ నలుగురు రైతులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ప్రియాంకా గాంధీని సీతాపూర్ గెస్ట్‌హౌజ్‌లో నిర్బంధించారు. అయితే ప్రియాంకాను కలిసేందుకు వెళ్తున్నట్లు సీఎం భూపేశ్ తెలిపారు. కానీ లక్నో పోలీసులు మాత్రం ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులతో సంభాషించే వీడియోను కూడా భూపేశ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.